సొంత రికార్డును బద్దలు కొట్టిన టీమ్ ఇండియా.. ఇంతకీ అదేంటంటే?
ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఘన విషయాని సాధించడం ద్వారా ఇక భారత జట్టు ఈ ఘనతను సాధించింది అని చెప్పాలి. అయితే శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు.. ఎనిమిది వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత కొండంత లక్ష్యంతో బలిలోకి దిగిన శ్రీలంక చతికిలబడిపోయింది. ఏకంగా భారత ఫేసర్ల దాటికి శ్రీలంక బ్యాటింగ్ విభాగం మొత్తం కుప్పకూలిపోయింది అని చెప్పాలి. శ్రీలంక బ్యాట్స్మెన్లు క్రీజులో కుదురుకోవడానికి ఎంతలా ప్రయత్నించినా భారత బౌలర్లు ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు.
ఆసియా కప్ లో భారత్ శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ని మరోసారి ఇటీవల వరల్డ్ కప్ మ్యాచ్ తలపించింది అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో 55 పరుగులకే ఆలౌట్ అయింది శ్రీలంక. దీంతో భారత జట్టు 302 పరుగుల తేడాతో విజయం సాధించింది.అయితే ఇదిలా ఉంటే ఇటీవల శ్రీలంకతో మ్యాచ్లో భారత్ చేసిన స్కోరు.. ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా కు అత్యధిక స్కోరు. 2011లో ఫిబ్రవరి 27వ తేదీన ఇంగ్లాండ్ పై భారత్ 338 పరుగులు చేయగా.. ఇప్పటివరకు ఇదే అత్యధిక పరుగులుగా కొనసాగింది. కానీ శ్రీలంకతో మ్యాచ్లో చేసిన 357 పరుగులతో ఈ రికార్డు బద్ధులు అయింది.