శ్రీలంకతో మ్యాచ్.. రోహిత్ ను ఊరిస్తున్న క్రేజీ రికార్డు?
ఇలా ఈ వరల్డ్ కప్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో ఎన్నో అరుదైన రికార్డులను కూడా సృష్టిస్తూ ఉన్నాడు రోహిత్ శర్మ. ఇప్పటికే ఏడాది 50 సిక్సర్లు కొట్టిన ఏకైక బ్యాట్స్మెన్ గా అరుదైన ఘనతను అందుకున్నాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో కూడా అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ గాను గేల్ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. అయితే ఇక ఇప్పుడు మరో క్రిస్ గేల్ రికార్డు పై రోహిత్ శర్మ కన్నేసాడట. ఈ క్రమంలోనే శ్రీలంకతో మ్యాచ్లో రోహిత్ శర్మని ఒక క్రేజీ రికార్డు ఊహిస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. వన్డే వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచేందుకు రోహిత్ కేవలం 7 సిక్సర్ల దూరంలో ఉన్నాడు.
శ్రీలంకతో గురువారం జరిగిన మ్యాచ్లో రోహిత్ ఈ ఘనత సాధించగలడు అని అభిమానులు కూడా ఆశిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఎందుకంటే రోహిత్ శర్మ దూకుడు చూస్తే అలా ఉంది. ప్రపంచ కప్ లు రోహిత్ శర్మ ఇప్పటికీ 20 సిక్సర్లు కొట్టాడు. శ్రీలంకతో మ్యాచ్లో మరో 7 సిక్సర్లు కొట్టాడు అంటే ఒక ప్రపంచ కప్ ఎడిషన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించబోతున్నాడు. ఈ క్రమంలోనే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును అధిగామిస్తాడు. కాగా 2015 వరల్డ్ కప్ లో క్రిస్ గేల్ ఒక వరల్డ్ కప్ ఎడిషన్ లో 26 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత 2019లో ఇయాన్ మోర్గాన్ 22 సిక్సర్లు.. ఏ బి డివిలియర్స్ 2015లో 21 సిక్సర్లతో రోహిత్ కంటే ముందున్నారు.