ప్చ్.. 4 సెంచరీలు మిస్ చేసుకున్న రోహిత్ శర్మ?

praveen
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంతకాలం నుంచి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అదిరిపోయే ప్రదర్శనలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్లో అయితే రోహిత్ అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో కూడా రోహిత్ శర్మ అటు జట్టును ఎంతో సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించడంలో విజయవంతం అవుతున్నాడు.

 తన కెప్టెన్సీ వ్యూహాలతో భారత జట్టుకు వరుస విజయాలను అందిస్తూ ఉన్నాడు రోహిత్ శర్మ. అంతేకాకుండా ఇక వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. ప్రతి మ్యాచ్ లో కూడా ఎంతో దూకుడుగా ఆడుతూ ఇక జట్టుకు మంచి ఆరంభాలను అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇక ఈ వరల్డ్ కప్ లో ఒక సెంచరీ కూడా చేశాడు అన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే రోహిత్ శర్మకు సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏకంగా రోహిత్ శర్మ నాలుగు సెంచరీలను మిస్ చేసుకున్నాడు.

 ప్రస్తుతం సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నప్పటికీ సెంచరీలకు అతి చేరువుగా వచ్చి అవుట్ అవుతున్నాడు రోహిత్ శర్మ 2023లో వన్డే ఫార్మాట్లో 80 కి పైగా స్కోర్ వద్ద నాలుగు సార్లు అవుట్ అయ్యాడు. ఇక ప్రస్తుతం భారత వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లోనే 86, 87 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇతర ప్లేయర్లు సెంచరీ దగ్గరికి రాగానే నెమ్మదిగా ఆడి సెంచరీ మైలు రాయిని అందుకుంటూ ఉంటే రోహిత్ శర్మ మాత్రం జట్టు ప్రయోజనం కోసం సెంచరీ గురించి ఆలోచించకుండా దూకుడు గా ఆడుతూ సెంచరీలని మిస్ చేసుకుంటున్నాడు. దీంతో అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: