డెంగీ వల్ల.. ఆరు కిలోలు తగ్గాను : గిల్
అయితే ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్ ఇండియాకు మొదటి నుంచి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జట్టులో కీలక ప్లేయర్లుగా కొనసాగుతున్న ఆటగాళ్లు ఏదో ఒక కారణంతో టీంకు దూరమవుతున్నారు. అయితే మొన్నటికి మొన్న టీంలో స్టార్ ఆల్ రౌండర్ కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా.. ఇక గాయం కావడంతో జట్టుకు దూరం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు ఇక జట్టులో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్న యంగ్ బ్యాట్స్మెన్ శుభమన్ గిల్ సైతం డెంగీ బారిన పడి ఇక జట్టుకు దూరమయ్యాడు.
అయితే ఇక ప్రస్తుతం జట్టులోకి వచ్చి బాగానే ఆడుతున్నాడు. ఇక వరల్డ్ కప్ కి ముందు తనకు డెంగీ సోకడం పై స్టార్ క్రికెటర్ గిల్ స్పందించాడు. నాకు ఎక్కడ డెంగి సోకిందో తెలియదు. నెదర్లాండ్స్ తో ప్రాక్టీస్ మ్యాచ్ సమయంలో కాస్త లక్షణాలు కనిపించాయ్. నేను ఎంతోకాలంగా ఆత్రుతగా ఎదురు చూస్తున్న నా మొదటి వరల్డ్ కప్ కి ముందు నేను ఇలా డెంగీ బారిన పడటంతో చాలా చిరాకుగా అనిపించింది. డెంగీ తో దాదాపు 6 కిలోల వరకు బరువు తగ్గిపోయాను అంటూ ఇటీవల చెప్పుకొచ్చాడు గిల్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గిల్.. ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి.