హార్దిక్ గాయంపై.. టీమిండియాకు గుడ్ న్యూస్?
అయితే ఇలా పటిష్టమైన జట్టుగా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ దూసుకుపోతున్న టీమిండియా కు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో ఊహించనీ ఎదురు దెబ్బ తగిలింది. మ్యాచ్లో విజయం సాధించినప్పటికీ.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం చీలమండ గాయం కారణంగా.. చివరికి జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా అతను అందుబాటులో లేకుండా పోయాడు అయితే అతని గాయం తీవ్రత ఎక్కువగా ఉందని వరల్డ్ కప్ మొత్తానికి కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు తెరమీదకి రావడంతో.. అభిమానులు అందరూ కూడా ఆందోళన చెందారు అని చెప్పాలి.
అయితే ఇటీవల ఇదే విషయం పై భారత జట్టుకు గుడ్ న్యూస్ అందింది అన్నది తెలుస్తుంది. చీలమండ గాయం తో బాధ పడుతున్న హార్దిక్ పాండ్యా మరో రెండు రోజుల్లో ట్రైనింగ్ సెషన్ మొదలు పెట్టే అవకాశం ఉందట. అయితే ఇంజక్షన్లను ఇచ్చి పాండ్యాను త్వరగా కోలుకునేలా చేయొచ్చు. కానీ భారత జట్టు సెమీ ఫైనల్ చేరడం దాదాపు ఖాయమైపోయింది. దీంతో అతను సహజంగానే కోలుకునేందుకు సమయం ఉంది. ఈ వారాంతంలో పాండ్యా తన శిక్షణను ప్రారంభిస్తాడు అంటూ బిసిసిఐ క్రికెట్ వర్గాల నుంచి సమాచారం. కాగా హార్దిక్ పాండ్యా వచ్చే మూడు మ్యాచ్లకు దూరంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.