ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మినీ వేలానికి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

praveen
బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే టి20 టోర్ని నిర్వహిస్తూ వస్తుంది. అయితే 2008లో ఒక సాదాసీదా టోర్నీగా ప్రారంభమైన ఐపీఎల్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఊహించని రీతిలో పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాదు ప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కూడా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లందరూ కూడా ఐపీఎల్లో భాగం అయి ప్రతి ఏడాది కూడా సత్తా చాటుతూ  ఉంటారు అని చెప్పాలి.


 అయితే ఐపీఎల్ కారణంగా ఇక అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాలనుకునే ఎంతో మంది యువ ఆటగాళ్ళకు మంచి ఛాన్స్ కూడా దొరుకుతూ ఉంది. అయితే ఒకవైపు భారీగా ఆదాయంతో పాటు ఇంకోవైపు పాపులారిటీ కూడా ఐపీఎల్ ద్వారా సంపాదించిన క్రికెటర్లు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. అయితే అచ్చం ఐపీఎల్ తరహాలోనే అటు బీసీసీఐ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ని కూడా నిర్వహించింది. మహిళా క్రికెట్ ను మరింత ప్రోత్సాహించాలి అని ఉద్దేశంతో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ని గత ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది బీసీసీఐ.


 ఈ క్రమంలోనే గత ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ జట్టు విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే  అయితే ఇప్పుడు 2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం సన్నాహాలను మొదలుపెట్టింది బీసీసీఐ. అయితే ఐపీఎల్ కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 19వ తేదీన నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయించగా.. ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కి సంబంధించిన మినీ వేలాన్ని డిసెంబర్ 9న నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ ఆక్షన్ దుబాయ్ వేదికగా జరిగే అవకాశం ఉండగా.. ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆక్షన్ వేదిక ఇంకా ఖరారు కాలేదు అన్నది తెలుస్తుంది. అయితే భారత్ వేదికగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wpl

సంబంధిత వార్తలు: