పేరుకే వరల్డ్ ఛాంపియన్.. లంకతో మ్యాచ్ అంటే ఇంగ్లాండుకు పుట్టెడు భయం?

praveen
వరల్డ్ క్రికెట్లో ఉన్న పటిష్టమైన జట్లలో ఇంగ్లాండ్ కూడా ఒకటి. ఒకరకంగా చెప్పాలి అంటే క్రికెట్ అనే ఆట పుట్టింది ఇంగ్లీష్ దేశంలో. అక్కడి నుంచి ప్రపంచ వ్యాప్తంగా పాకిపోయింది. అందుకే అటు ఇంగ్లాండ్ ని క్రికెట్కు పుట్టినిల్లు అని చెబుతూ ఉంటారు విశ్లేషకులు. ఇక ఇంగ్లాండ్ జట్టు ప్రపంచ క్రికెట్లో ఛాంపియన్ టీంగా ప్రత్యర్ధులను భయపెట్టే పటిష్టమైన జట్టుగా కూడా ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ఉంది అని చెప్పాలి  ఆ జట్టులో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా తమ ఆట తీరుతో అభిమానులను సంపాదించుకున్నారు.

 అలాంటి పటిష్టమైన టీం ఇటీవల 2023 వన్డే వరల్డ్ కప్ లో డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగింది. అయితే అటు ఇంగ్లాండ్ పై అందరూ పెట్టుకున్న అంచనాలు మాత్రం తారుమారు అయ్యాయి. వరస విజయాలు సాధిస్తూ హవా నడిపిస్తుంది అనుకున్న ఇంగ్లాండ్ జట్టు వరుస ఓటములతో చతికిల పడిపోయింది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక దాదాపు సెమీఫైనల్ అవకాశాలను కోల్పోయింది అని చెప్పాలి. ఇప్పుడు వరకు ఐదు మ్యాచ్లు ఆడిన ఇంగ్లాండ్ టీం కేవలం ఒకే ఒక్క విజయాన్ని మాత్రమే సాధించింది. ఇక ఇటీవల శ్రీలంక టీం పై 8 వికెట్ల తేడాతో ఓడిపోయి.. హ్యాట్రిక్ పరాజయాలను చవిచూసింది ఇంగ్లాండు జట్టు.

 ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వన్డే వరల్డ్ కప్పులో ప్రత్యర్థులను భయపెట్టే ఇంగ్లాండుకు మాత్రం శ్రీలంక టీం అంటే కాస్త ఎక్కువగానే భయపడుతుందట. ఎంతలా అంటే 2019 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ టోర్నీలో శ్రీలంకపై గెలవలేకపోయింది. ఇప్పుడే కాదు 50 ఓవర్ల వరల్డ్ కప్ లో 1999లో చివరిసారిగా ఇంగ్లాండ్ శ్రీలంకను ఓడించింది. 24 ఏళ్లుగా శ్రీలంకను ఓడించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంగ్లాండ్ వ్యూహాలకు ఫలించలేదు. ఇక ఇప్పుడు 2023 వరల్డ్ కప్ లో కూడా ఇదే రిపీట్ అయింది. శ్రీలంక చేతిలో ఇంగ్లాండు దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: