ఇంగ్లాండ్ జట్టును.. రెండుసార్లు దెబ్బ కొట్టిన ఆఫ్ఘనిస్తాన్?

praveen
వన్డే వరల్డ్ కప్ 2023 ఎడిషన్ లో భాగంగా ఎప్పటిలాగానే ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగింది ఆఫ్గనిస్తాన్ జట్టు. వరల్డ్ కప్ లో ఆడుతుంది అంటే ఆడుతుంది. లీగ్ మ్యాచ్లు ఆడి వరుస పరాజయాలతో చివరికి ఇంటి బాట పట్టడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఈ వరల్డ్ కప్ లో సంచలన విక్టరీలను సాధిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ జట్టు. అంచనాలకు మించి ప్రదర్శన చేస్తూ అదరగొడుతుంది అని చెప్పాలి. ప్రపంచ క్రికెట్లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న టీమ్స్ ని సైతం దారుణంగా ఓడిస్తూ ఎన్నో గ్రాండ్ విక్టరీలను సొంతం చేసుకుంటుంది.



ఇటీవల పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ లోను అదరగొట్టింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా పటిష్టమైన పాకిస్తాన్ ను దారుణంగా ఓడించింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ పై 8 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు. అయితే అంతకుముందు డిపెండింగ్ ఛాంపియన్గా వరల్డ్ కప్ లో బరిలోకి దిగిన ఇంగ్లాండు పై కూడా ఘన విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఇంగ్లాండ్ పై ఆఫ్ఘనిస్తాన్ సాధించిన విజయం అయితే క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యంలో ముంచేసింది. అయితే ఇంగ్లాండు జట్టును ఈ వరల్డ్ కప్ లో భాగంగా ఆఫ్గనిస్తాన్ రెండుసార్లు దెబ్బ కొట్టింది అన్నది తెలుస్తుంది.


 అదేంటి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇంగ్లాండు పై ఒక్కసారి మాత్రమే కదా విజయం సాధించింది. ఇక రెండుసార్లు ఎలా దెబ్బ కొడుతుంది అని అనుకుంటున్నారు కదా. తొలుత ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచి దెబ్బ కొట్టిన ఆఫ్ఘనిస్తాన్ ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో గెలుపుతో టేబుల్ లో ఆరువ స్థానానికి చేరుకుంది. దీంతో ఇంగ్లాండ్ జట్టు అట్టడుగుకు వెళ్ళిపోయింది అని చెప్పాలి. మ్యాచ్ కి ముందు వరకు తొమ్మిదవ స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ఇప్పుడు పదవ స్థానానికి పడిపోయింది. అయితే పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాలలో ఇండియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: