వారెవ్వా.. తిలక్ వర్మ సూపర్ సెంచరీ?

praveen
తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ గురించి అటు భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడుతూ తిలక్ వర్మ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. జట్టులో ఉన్న సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా విఫలమవుతున్న సమయంలో అతను మాత్రం నిలకడగా రాణిస్తూ మంచి పరుగులు చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఈ క్రమంలోనే అతి తక్కువ సమయంలోనే అటు భారత జట్టులో కూడా చోటు సంపాదించుకున్నాడు అని చెప్పాలి.


 అంతర్జాతీయ క్రికెట్లో కూడా నిలకడైన బ్యాటింగ్ తో మాజీ ఆటగాళ్ల నుంచి ప్రశంసలు అందుకున్నాడు ఈ తెలుగు క్రికెటర్. ఈ క్రమంలోనే ఆసియా కప్ కోసం ఎంపికయ్యాడు. అయితే ఆసియా కప్ లో మాత్రం పెద్దగా అవకాశాలను దక్కించుకోలేకపోయాడు తిలక్ వర్మ. ఇక ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లు అందరూ కూడా వరల్డ్ కప్ లో వరుసగా మ్యాచ్లో ఆడుతూ బిజీగా ఉండగా.. ఇక వరల్డ్ కప్ కోసం ఎంపిక అవ్వని యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు అని చెప్పాలి.


 అది సరేగాని ఇప్పుడు తిలక్ వర్మ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటారా.. ఇటీవల తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు  ఏకంగా సెంచరీ తో చెలరేగిపోయాడు  సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా బరోడా జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు హైదరాబాద్ తరఫున 69 బంతుల్లోనే 121 పరుగులు చేశాడు. ఇందులో 16 ఫోర్లు ఆరు సిక్సర్లు ఉండడం గమనార్హం. తిలక్ వర్మ ఒంటరి పోరాటంతో ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లకు 186 పరుగులు చేసింది. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్ లలో కలిపి 271 పరుగులు చేసిన తిలక్ వర్మ టోర్నీలో టాప్ స్కోరర్లలో రెండవ స్థానంలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: