సెంచరీ మిస్ అయిన.. కోహ్లీ అరుదైన ఘనత?

frame సెంచరీ మిస్ అయిన.. కోహ్లీ అరుదైన ఘనత?

praveen
ప్రపంచ క్రికెట్లో పరుగులు యంత్రం అనే ఒక అరుదైన బిరుదును సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ.. ఇక ఈ బిరుదును సార్ధకం చేసే విధంగానే ప్రతి మ్యాచ్ లో కూడా ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చి ఇంకా ఏదో నిరూపించుకోవాలనుకునే యంగ్ ప్లేయర్ లాగా ప్రతి మ్యాచ్లో కూడా కనిపిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే చాలు ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో భయం పడుతూ ఉంటుంది.


 అతని బ్యాటింగ్ విధ్వంసానికి ఎక్కడ చెత్త రికార్డులు మూట కట్టుకోవాల్సి వస్తుందో అని బౌలర్లు భయపడుతూనే బంతులు వేస్తూ ఉంటారు. అయితే మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన కోహ్లీ ఆ తర్వాత మాత్రం మునుపడి పాము అందుకొని ప్రస్తుతం విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. వరుసగా సెంచరీలు చేస్తూ అదరగొడుతూ ఉన్నాడు. వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో సెంచరీ తో చెలరేగిపోయిన కోహ్లీ.. ఇక న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లోను సెంచరీ చేయాలని అనుకున్నాడు. అయితే మ్యాచ్ జరుగుతున్న పరిస్థితులు చూస్తే కోహ్లీకి సెంచరీ రావడం ఖాయమని అభిమానులు కూడా భావించారు.


 కానీ ఊహించని రీతిలో 95 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ క్యాచ్ ఇచ్చి వికెట్ కోల్పోయాడు. అయితే సెంచరీ మిస్ అయినప్పటికీ అటు విరాట్ కోహ్లీ మాత్రం ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. వన్డే వరల్డ్ కప్ 2023 ఎడిషన్ లో భాగంగా ఐదు మ్యాచ్లలో 354 పరుగులు సాధించాడు. అయితే ఈ వరల్డ్ కప్ లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. దీంతో అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్గా టాప్ లో ఉన్నాడు కోహ్లీ. తర్వాత రోహిత్ శర్మ 311 పరుగులు.. మహమ్మద్ రిజ్వాన్ 294 పరుగులు, రచిన్ రవీంద్ర 290, దారెల్ మిచెల్ 268 పరుగులతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: