మామకు తగ్గ అల్లుడు.. షాహిన్ అరుదైన రికార్డ్?

praveen
ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ బౌలర్ల లిస్టు తీస్తే.. అందులో పాకిస్తాన్ జట్టులో తురుపు ముక్కగా చెప్పుకునే షాహిన్ ఆఫ్రిది పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే  తన ఫేస్ బౌలింగ్ తో ఎప్పుడు ప్రత్యర్థులను భయపెడుతూ ఉంటాడు ఈ బౌలర్. అయితే ప్రస్తుతం వరల్డ్ కప్ లో కూడా పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ అటు షాహిన్ ఆఫ్రిది మాత్రం ఇక ప్రతి మ్యాచ్ లో కూడా వరుసగా వికెట్లు తీస్తూ అదరగొడుతున్నాడు అని చెప్పాలి. అయితే ఇలా తన బౌలింగ్ తో ఇప్పటికే ఎన్నో రికార్డులు కూడా బద్దలు కొట్టాడు.

 ఇకపోతే వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవలే పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియా తో మ్యాచ్ ఆడింది  అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఆస్ట్రేలియా కు ఎక్కడ పోటీ ఇవ్వలేకపోయింది అని చెప్పాలి. దీంతో దారుణమైన ఓటమి చవిచూసింది. ఏకంగా 62 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా పాకిస్తాన్ పై విజయం సాధించింది అని చెప్పాలి. అయితే పాకిస్తాన్ ఓడిపోయినప్పటికీ ఆ జట్టు బౌలర్ షాహీన్ మాత్రం అత్యుత్తమ ప్రదర్శన కనపరచాడు. ఏకంగా ఈ మ్యాచ్లో ఐదు వికెట్లు సాధించి అదరగొట్టాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఈ ఐదు వికెట్ల ద్వారా ఒక అరుదైన రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఏకంగా సొంత మామ పాకిస్తాన్ మాజీ ఆటగాడు అయిన షాహిద్ ఆఫ్రిది రికార్డును బ్రేక్ చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన షాహిన్.. తన కెరియర్ లో రెండోసారి ఐదు వికెట్ల హాల్ నమోదు చేశాడు. దీంతో తన మామ షాహిద్ ఆఫ్రిది రికార్డును సమం చేశాడు. పాకిస్తాన్ జట్టు నుంచి ఈ ఇద్దరు బౌలర్లు మాత్రమే వరల్డ్ కప్ టోర్నీలో ఐదేసి వికెట్లు రెండుసార్లు తీశారు. మరెవరికి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు అని చెప్పాలి. దీంతో మామకు తగ్గ అల్లుడు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: