కోహ్లీ సెంచరీ చేయడం ఓకే.. కానీ నెట్ రన్ రేట్ కూడా చూసుకోవాలిగా : పూజారా
ఈ క్రమంలోనే ఇటీవలే బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ తో అదరగొట్టాడు. బంగ్లాదేశ్ బౌలర్లతో చెడుగూడు ఆడుతూ సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే తన అంతర్జాతీయ కెరియర్లో 78 సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలోనే సెంచరీ తో దుమ్ము దులిపిన విరాట్ కోహ్లీపై మాజీ ఆటగాళ్లందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కోహ్లీ సెంచరీపై అటు భారత సీనియర్ టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ పూజార మాత్రం భిన్నంగా స్పందించాడు అని చెప్పాలి. విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం బాగానే ఉంది. కానీ నెట్ రన్ రేట్ కూడా చూసుకుంటే బాగుంటుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పూజార.
ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ సెంచరీపై పూజార మాట్లాడుతూ కోహ్లీ సెంచరీని నేను కూడా కోరుకున్నాను. కానీ వీలైనంత త్వరగా గేమ్ ను పూర్తి చేసి జట్టు రన్రేట్ పెంచేలా చూస్తే మరింత బాగుంటుంది అంటూ చతేశ్వర పూజార అభిప్రాయం వ్యక్తం చేసాడు. మీ మొదటి ప్రాధాన్యత జట్టుకి ఇవ్వాలి అంటూ పూజార చెప్పాడు. అయితే పూజార వ్యాఖ్యలతో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మ్యాథ్యూ హెడేన్ కూడా ఏకీభవించాడు. ప్రపంచ కప్ లాంటి టోర్నమెంట్ లో నెట్ రన్ రేట్ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు మ్యాథ్యూ హెడెన్. అందుకే నెట్ రన్ రేట్ విషయంలో ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచించాడు.