ఓటమి బాధలో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు.. అదిరిపోయే గుడ్ న్యూస్?

praveen
ప్రపంచ క్రికెట్లో ఛాంపియన్ టీం గా కొనసాగుతుంది ఇంగ్లాండ్. అయితే ఏ ఫార్మాట్లో వరల్డ్ కప్ జరిగిన కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అలాంటి ఇంగ్లాండ్ జట్టుకు ఏటీవలే ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో మంచి ప్రదర్శన చేయాలనుకుంటున్న ఇంగ్లాండుకు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ ఉండడంతో ఎదుటి దెబ్బలు తగులుతున్నాయ్. ఇక మరోవైపు ఇటీవల పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో దారుణమైన ఓటమిని చవిచూసింది ఇంగ్లాండ్.


 అయితే ఇలా ఆఫ్గనిస్తాన్ చేతిలో ఓడిపోయిన బాధ నుంచి ఇంకా బయటపడని ఇంగ్లాండ్కు ఇప్పుడు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది అన్నది తెలుస్తుంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పూర్తి ఫిట్నెస్ సాధించాడని తెలుస్తుంది. ఈ క్రమంలోనే తదుపరి మ్యాచ్ లలో అతను అందుబాటులో ఉండబోతున్నాడని సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి బాధలో ఉన్న ఇంగ్లాండ్కు ఇది నిజంగా ఊరటను ఇచ్చే వార్తే అని చెప్పాలి. అయితే వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన బెన్ స్టోక్స్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తితో తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని ఇక వరల్డ్ కప్ కోసం మళ్లీ జట్టులోకి వచ్చాడు.


 కానీ ఇప్పటివరకు వరల్డ్ కప్ లో భాగంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఎందుకంటే కాలి గాయంతో ఇబ్బంది పడుతున్న స్టోక్స్ గత మూడు మ్యాచ్లలోనూ బెంచ్ కే పరిమితమయ్యాడు. అయితే ఆఫ్గనిస్తాన్తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ సారథి జోస్ బట్లర్ కూడా స్టోక్స్ ఎంట్రీ పై కీలకమైన అప్డేట్ ఇచ్చాడు. స్టోక్స్ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడని.. తదుపరి మ్యాచ్కి అందుబాటులో ఉంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లాండ్ జట్టు ఈనెల 21వ తేదీన ముంబైలోని వాంకడే స్టేడియంలో సౌత్ ఆఫ్రికా తో మ్యాచ్ ఆడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: