బాబర్ తర్వాత.. అతనికి కెప్టెన్సీ అప్పగిస్తే బెటర్ : పాక్ మాజీ

praveen
సాధారణంగా క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న ఆటగాడు ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ జట్టును గెలిపించలేక పోతే.. అతన్ని వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పించాలి అంటూ డిమాండ్లు తెరమీదకి రావడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్లో కూడా ఇదే జరుగుతూ ఉంది. ప్రపంచ కప్ లో భారత్ పై విజయం సాధించాలి అనే కల మరోసారి పాకిస్తాన్ కు కలగానే మిగిలిపోయింది. ప్రపంచ కప్ లో వరుసగా 8వ సారి భారత జట్టు దాయాది పాకిస్తాన్ పై విజయం సాధించింది.


 అయితే పాకిస్తాన్ టీం బ్యాటింగ్లో బౌలింగ్లో ఎక్కడ ప్రభావం చూపలేకపోయింది అని చెప్పాలి. అయితే ఈ ఓటమి తర్వాత బాబర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడం పై చర్చలు జోరందుకున్నాయి. బాబర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి కొత్తవారికి కెప్టెన్సీ అప్పగిస్తే బాగుంటుందని ఎంతోమంది పాకిస్తాన్ క్రికెట్ ప్రేక్షకులతో పాటు మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాబర్ పరిమిత ఓవర్ల  కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పేస్తే కేవలం టెస్టులకు మాత్రమే పరిమితం కావాలని కొంతమంది మాజీలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 ఇదే విషయంపై షోయబ్ మాలిక్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ కెప్టెన్సీకి రాజీనామా చేస్తే షాహిన్ ఆఫ్రీది వైట్ బాల్ కెప్టెన్ గా మారాలని అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే అతను లాహోర్ కలందర్స్ కు అటాకింగ్ కెప్టెన్ అని నిరూపించాడు అంటూ గుర్తు చేశాడు  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 ఎడిషన్ లో షాహిన్ తన కెప్టెన్సీలో లాహోర్ కలందర్స్ జట్టును ఛాంపియన్గా నిలిపాడు అని చెప్పాలి. అంతకు ముందు 2022లో కూడా  ఆఫ్రిది కెప్టెన్సీలో లాహోర్ కలందర్స్ ఛాంపియన్గా నిలిచింది. దీంతో బాబర్ తర్వాత అతనికి కెప్టెన్సీ  అప్పగిస్తేనే బాగుంటుందని మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: