బాబర్.. పరువు తీసేసావ్.. కోహ్లీని జెర్సీ అడగటం అవసరమా?

praveen
టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం ఇద్దరు కూడా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్లుగా కొనసాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎంతోమంది లెజెండ్ సాధించిన రికార్డులను బద్దలు.. కొడితే ఇక కోహ్లీ సాధించిన రికార్డులను బద్దలు కొట్టడమే లక్ష్యంగా బాబర్ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి  అందుకే ప్రపంచ క్రికెట్లో ఎంతోమంది బ్యాట్స్మెన్లు ఇద్దరు ఆటగాళ్ల ఆట తీరును పోల్చి చూడడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే వీరిద్దరి గురించి మాట్లాడే వారు ఎన్నిసార్లు విమర్శలు చేసినప్పటికీ ఈ ఇద్దరి మధ్య మాత్రం సాన్నిహిత్యం చాలా బాగుంటుంది అని చెప్పాలి. గతంలో ఒకరు ఫామ్ కోల్పోయినప్పుడు మరొకరు ఇక సోషల్ మీడియా వేదికగా మద్దతుగా నిలుస్తూ పోస్టులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో బాబర్ కెప్టెన్సీ వహిస్తున్న పాకిస్తాన్ జట్టు ఘోర ఓటమి చవిచూసింది. ఈ క్రమంలోనే ఈ ఓటమి తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ విరాట్ కోహ్లీ దగ్గరికి వచ్చి మాట్లాడాడు.


 అంతేకాదు ఆ సమయంలో విరాట్ కోహ్లీ తాను సంతకం చేసి ఉన్న జెర్సీని బాబర్ కు బహుమతిగా ఇచ్చి.  ఇక మ్యాచ్ ఓటమిపై స్పందిస్తూ ఓదార్చాడు అని చెప్పాలి. అయితే ఇదే విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ ప్లేయర్ వసీం అక్రమ్ బాబర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కోహ్లీ జెర్సీ బహుకరించిన తర్వాత  ఇద్దరు ప్లేయర్లు కూడా కాసేపు నవ్వుతూ మాట్లాడారు. ఈ క్రమంలోనే ఇదే విషయంపై వసీం అక్రమ్ మాట్లాడుతూ.. బాబర్ మైదానంలోని కెమెరాల ముందు కోహ్లీ నుండి టీషర్టులు అడిగారు  ఇది కెమెరా కంటికి కనపడకుండా డ్రెస్సింగ్ రూమ్ దగ్గర అడిగి ఉంటే బాగుండేది. మీ అంకుల్ కొడుకులు కోహ్లీ టీ షర్టు తీసుకురమ్మంటే అది అడగాల్సిన పద్ధతి ఇది కాదు అని వసీం అక్రమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటలో సీరియస్ గా ఉండాలి  కానీ వ్యక్తిగతంగా అందరూ బాగుంటేనే క్రికెట్ ఆరోగ్యకరంగా ఉంటుంది. కానీ వసీం అగ్రం ఇలా మాట్లాడటం మాత్రం ప్రస్తుతం విమర్శలకు దారితీస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: