హృతిక్: తెలుగులో దమ్మున్న హీరో అతనే?

Veldandi Saikiran

ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు, ప్రఖ్యాతలు అందుకున్నాడు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర. దేవర సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా.... జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించింది. జాన్వి కపూర్ తెలుగులో నటించిన మొదటి సినిమా దేవర కావడం విశేషం.



ఈ సినిమా అనంతరం ఈ చిన్నది తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటుంది. కాగా, ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమా షూటింగ్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ వార్-2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను చాలా వేగంగా నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే పూర్తి చేసి థియేటర్లలో రిలీజ్ చేయాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నారట.



ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉండగా.... బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. నాకు తెలుగులో ఇష్టమైన హీరో ఎన్టీఆర్. అతను చాలా గొప్ప నటుడు మంచి టీం మేట్. మా సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి అభిమానుల ముందుకు తీసుకువస్తామని హృతిక్ రోషన్ అన్నారు.


అంతే కాకుండా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ ను ఉద్దేశించి హృతిక్ రోషన్ ఇలా మాట్లాడడంతో ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: