నడవలేని స్థితిలో బిగ్ బాస్ ఆదర్శ్..ఏమైందంటే?
ఈయన చాలానే తెలుగు సినిమాలలో కూడా నటించాడు. అందులో కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలో.. మరికొన్ని సినిమాలలో సహాయక పాత్రలో ఆదర్శ్ నటించాడు. ఆదర్శ్, వరుణ్ సందేష్ నటించిన హ్యాపీ డేస్ సినిమాలో నటించాడు. ఆ తర్వాత రైడ్, జీనియస్, మరో చరిత్ర, రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే, అల్లు అర్జున్ నటించిన సరైనోడు, విజేత, కలర్ ఫోటో, జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈయన నటన చాలా సహజంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఆదర్శ్ బాలకృష్ణ హీరో మెటీరియల్ అని చెప్పొచ్చు. ఈయన బిగ్ బాస్ తర్వాత చాలా కాలం సినిమాలలో కనిపించలేదు.
అయితే తాజాగా ఆదర్శ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆదర్శ్ గాయపడ్డాడు. ఆయన మోకాలికి గాయమైంది. ఆ గాయపడిన కాలికి సర్జరీ చేశారు. ప్రస్తుతం ఇంటికి వచ్చి ఫిజియోథెరపీ లాంటివి కూడా చేస్తున్నాడు. ఆ వీడియో పోస్ట్ చేసి.. త్వరలో క్యామ్ బ్యాక్ ఇస్తాను అని క్యాప్షన్ లో ఆదర్శ్ రాసుకొచ్చాడు. ఇక ఆదర్శ్ కి ఏమైంది అనేది తెలీదు. ఇది చూసిన నెటిజన్స్ త్వరలో కొలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.