మ్యాచ్ కు ముందే.. ఇంగ్లాండ్ కు బిగ్ షాక్.. అతనికి గాయం?
అయితే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే కొన్ని టీమ్స్ ని గాయాల బెడద తీవ్రంగా వేధిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్లేయర్లు గాయం బారిన పడుతూ చివరికి జట్టుకు దూరమవుతున్నారు. ఇక ఆయా ప్లేయర్లను మరో ప్లేయర్ తో భర్తీ చేయడం ఇక జట్టు యాజమాన్యాలకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అయితే నేడు న్యూజిలాండ్తో మొదటి మ్యాచ్ ఆడటానికి ఇంగ్లాండ్ సిద్ధమవుతూ ఉండగా.. మ్యాచ్ ప్రారంభంనికి ముందే ఇంగ్లాండు జట్టుకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది ఇంగ్లాండ్ జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న బెన్ స్టోక్స్ తుంటి నొప్పితో బాధపడుతున్నాడు.
అయితే భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ కోసం బెన్ స్టోక్స్ ఏకంగా వన్డే ఫార్మాట్కు ప్రకటించిన రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని మరి జట్టులోకి వచ్చాడు. క్రికెట్ బోర్డు విజ్ఞప్తితో ఈ పని చేశాడు స్టోక్స్. దీంతో అతను వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ విజయాలలో కీలక పాత్ర వహిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అంతలోనే తుంటి నొప్పితో బాధపడుతూ గాయం బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ కెప్టెన్స్ మీట్ లో తెలిపాడు. న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్ కి స్టోక్స్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.