వరల్డ్ కప్ ముంగిట సౌత్ ఆఫ్రికాకు భారీ షాక్.. స్వదేశానికి కెప్టెన్?

praveen
అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకమైన ప్రపంచకప్ ప్రారంభం కాబోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ కోసం టోర్నీలో పాల్గొనబోయే పది జట్ల సభ్యులందరూ కూడా ఇండియాలో అడుగుపెడుతున్నారు అని చెప్పాలి. అయితే అక్టోబర్ 5వ తేదీ నుంచి అధికారిక మ్యాచ్లు ప్రారంభం కానుండగా.. అంతకుముందే అన్ని జట్లు కూడా రెండేసి వార్మప్  మ్యాచ్ లు ఆడబోతున్నాయి అని చెప్పాలి. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి ప్రాక్టీస్ మ్యాచ్లు ప్రారంభమై మూడు రోజులపాటు కొనసాగనున్నాయి.

 అయితే ఇలా వార్మఫ్ మ్యాచ్ లకు సిద్ధం అయ్యేందుకు అన్ని టీమ్స్ కంటే ముందుగానే భారత్కు చేరుకుంది దక్షిణాఫ్రికా జట్టు. ఇక ఈసారి వన్డేల్లో మంచి ప్రదర్శన చేస్తున్న సౌత్ ఆఫ్రికా టైటిల్ ఫేవరెట్ గానే బలిలోకి దిగబోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే సౌత్ ఆఫ్రికా టీం కి ఊహించని పెద్ద షాక్ తగిలింది అన్నది తెలుస్తోంది. కెప్టెన్ గా కొనసాగుతున్న తెంపా బావుమా స్వదేశానికి వెళ్ళిపోయాడు. కుటుంబ కారణాల వల్ల టెంపా బావుమా దక్షిణాఫ్రికాకు తిరుగు పయనం అయ్యాడు అన్నది తెలుస్తుంది. అయితే అతను 2 వార్మప్ మ్యాచ్లకు కూడా అందుబాటులో ఉండడు అని సమాచారం.

 దక్షిణాఫ్రికా తొలి వార్మప్ మ్యాచ్ను సెప్టెంబర్ 29వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ తో ఆడనుంది. ఇక ఆ తర్వాత అక్టోబర్ రెండవ తేదీన న్యూజిలాండ్తో రెండో వారం మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా తొలి మ్యాచ్లో శ్రీలంకతో అధికారిక మ్యాచ్ ఆడబోతుంది. అక్టోబర్ 7వ తేదీన ఈ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. ప్రస్తుతం కెప్టెన్ టెంప భావుమా స్వదేశానికి తిరుగు పయనం కావడంతో జట్టు కెప్టెన్సీ బాధ్యతలను మర్కరమ్ భుజాన వేసుకున్నాడు. అయితే సూపర్ ఫామ్ లో ఉన్న కెప్టెన్ తెంపా బావుమా ఇక తిరిగి స్వదేశం పయనం అవడం మాత్రం జట్టుకు ఊహించని ఎదురిదెబ్బ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: