పాకిస్తాన్ ను.. ఇండియా కోలుకోలేని దెబ్బ కొట్టింది : రమిజ్ రజా

praveen
ఆసియా కప్ ప్రారంభం కావడానికి ముందు నుంచే ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ టీమ్స్ గా కొనసాగుతూ ఉన్నాయి ఇండియా, పాకిస్తాన్ లు. ఈ రెండు జట్లు కూడా అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించి ఫైనల్ వరకు చేరుకుంటాయని ఫైనల్లో కూడా పోటీ పడతాయని క్రికెట్ విశేషములు ఎంతో మంది అంచనా వేశారు. కానీ అందరి అంచనా తారుమారు అయింది. ఇక భారత్ ఫైనల్ చేరినప్పటికీ పాకిస్తాన్ మాత్రం సూపర్ ఫోర్ మ్యాచ్ తోనే  సరిపెట్టుకుంది. శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో చివరికి ఫైనల్ లో అడుగు పెట్టలేక ఇంటి బాట పట్టింది.

 అయితే ఆసియా కప్ లో భాగంగా సూపర్ ఫోర్ట్ లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విజయంతో దాయాది పాకిస్తాన్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టింది భారత్. ఇక ఈ దెబ్బ నుంచి కోలుకోకపోవడం వల్లే శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లోను పాకిస్తాన్ మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. ఇక ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రమిజ్ రాజా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా  పాకిస్తాన్ జట్టును మానసికంగా కోలుకోలేని దెబ్బతీసింది అంటూ రమిజ్ రాజా అభిప్రాయపడ్డాడు.

 అయితే ఇండియా చేతుల్లో భారీ ఓటమితో పాకిస్తాన్  ఆత్మవిశ్వాసం దెబ్బతింది. ఇక ఇదే అటు శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లోను ప్రభావం కనిపించింది. వాళ్లు చాలా భయం భయంగా పిరికి పిరికిగా పాకిస్తాన్  ఆడటం కనిపించింది   బాబర్ అజామ్ టాప్ ఆర్డర్ అతి జాగ్రత్తకు పోయారు. ఎప్పటిలాగా ప్రత్యర్థి పై ఆదిపత్యం చలాయించలేకపోయారు అంటూ రమిజ్ రాజా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా తెలిపాడు. ఇక ఫామ్ లో లేని ఫకర్ జమాన్ ను జట్టులోకి తీసుకోవడం కూడా తప్పు అంటూ రమిజ్ చెప్పుకొచ్చాడు. కాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: