ఆసియా కప్ లో ఓటమి.. పాపం బాబర్ ఎలా ఏడ్చాడో చూడండి?
అయితే వర్షం అంతరాయం కలిగించడంతో ఇక ఈ మ్యాచ్ ఓవర్లను 42 ఓవర్లకు కుదిస్తూ రిఫరీలు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలిస్తే నేరుగా అటు పాకిస్తాన్ ఫైనల్లో అడుగు పెట్టేది. ఇక అప్పటికే ఫైనల్ కు చేరిన భారత జట్టుతో పోటీపడేది. అయితే 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక చివరి బంతి వరకు పోరాడింది. ఆఖరి బతికి రెండు పరుగులు రాబట్టాల్సిన స్థానంలో సరిగ్గా రెండు రన్స్ తీసి లంకకు ఫైనల్ కు తీసుకువెళ్లాడు లంక ఆల్రౌండర్ చరిత్ అసలంక. దీంతో పాకిస్తాన్ కు ఛాంపియన్గా నిలవాలన్నా కల మరోసారి కలగానే మిగిలిపోయింది.
దీంతో ఎంతో నిరాశతో పాకిస్తాన్ జట్టు ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. అయితే ఈ ఓటమి తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో ఇక ఈ ఓటమి అటు బాబర్ కూడా జీర్ణించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే ఆఖరి వరకు పోరాడిన ఫలితం లేకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఏకంగా మైదానంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా చక్కర్లు పడుతూ ఉన్నాయి. ఆసియా కప్ లో మాత్రమే కాదు గత కొన్నేళ్ల నుంచి వరల్డ్ కప్ లలో కూడా సెమీఫైనల్ ఫైనల్ లో వెను తిరుగుతూ ఉంది పాకిస్తాన్.