2019 తర్వాత.. టీమిండియాకు ఇదే తొలిసారి?

praveen
ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు ఇక ఆసియా కప్ లో భాగంగా శ్రీలంక పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే వరుసగా మ్యాచ్ లు ఆడుతున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఈ మ్యాచ్ లలో భాగంగా అటు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కూడా జరుగుతూ ప్రేక్షకులకు అసలు సిసలైన  ఎంటర్టైన్మెంట్  పంచుతుంది. అయితే ప్రతి మ్యాచ్ లో కూడా టీమిండియా బ్యాటింగ్ విభాగం అదరగొడుతుంది అని చెప్పాలి. మొన్నటికి మొన్న కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు గాయం బారినపడి జట్టుకు దూరమవడంతో.. ఇక భారత బ్యాటింగ్ విభాగం పెద్దగా పటిష్టంగా కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం అదిరిపోయే ప్రదర్శన చేస్తుంది అని చెప్పాలి.

 అయితే గత కొంతకాలం నుంచి టీమిండియా ఆటగాళ్లు వన్డే ఫార్మాట్లో పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో.. ఇక ఎవరు టాప్ టెన్ లో చోటు తగ్గించుకోలేకపోతున్నారు. ఒకవేళ దక్కించుకున్న ఎవరో ఒక్కరు పేరు కనిపిస్తుంది తప్ప.. ఇద్దరు ముగ్గురు ఆటగాళ్ల పేర్లు టాప్ టెన్ లో చూసి చాలా కాలమే అవుతుంది అని చెప్పాలి. అయితే దాదాపు 2019కి ముందు టాప్ టెన్ లో ముగ్గురు ఇండియా బ్యాట్స్మెన్లు కనిపించేవారు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకరు ఇద్దరు తప్ప ముగ్గురు ఆటగాళ్లు టాప్ 10 లో కనిపించిన సందర్భం రానే రాలేదు.


 కానీ ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో మాత్రం అటు భారత ఆటగాళ్లు టాప్ టెన్ లో చోటు సంపాదించుకున్నారు అని చెప్పాలి. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్లో గిల్ హాఫ్ సెంచరీ చేయడంతో.. అతను ఐసిసి ప్రకటించిన ర్యాంకింగ్స్ లో మూడు నుంచి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఇదే పర్ఫామెన్స్ చేస్తే బాబర్ నెంబర్ వన్ స్థానాన్ని గిల్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో ఇక రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సైతం టాప్ టెన్ లో చోటు సంపాదించుకున్నారు అని చెప్పాలి. కెప్టెన్ రోహిత్ శర్మ 8వ స్థానంలో విరాట్ కోహ్లీ 9వ ర్యాంకులో కొనసాగుతూ ఉన్నారు. ఇలా 2019 తర్వాత ముగ్గురు టీమిండియా బ్యాట్స్మెన్లు టాప్ టెన్ లో చోటు సంపాదించుకోవడం ఇదే తొలిసారి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: