టీమిండియాలో.. అందరికంటే నాపైనే ఎక్కువ భారం : హార్దిక్

praveen
భారత్ క్రికెట్ లో టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు అంటే ప్రతి ఒక్కరు చెప్పే పేరు హార్దిక్ పాండ్యా అని అప్పటివరకు కెప్టెన్సీ రేసులో హార్దిక్ పాండ్యా పేరు ఎక్కడ వినిపించలేదు. శ్రేయస్, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్లే ఇక రోహిత్ శర్మ తర్వాత ఫ్యూచర్ కెప్టెన్ అని అందరూ భావించారు. కానీ ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్సీ అందుకున్నాడో.. ఇక ఎప్పుడైతే అతను మొదటి ప్రయత్నంలోనే ఐపిఎల్ టైటిల్ విన్నర్గా నిలిచాడో.  అప్పటినుంచి అతని కెప్టెన్సీ నైపుణ్యానికి అందరూ ఫిదా అయిపోయారు. దీంతో ఇక అప్పటివరకు కెప్టెన్సీ రేసులో ఎక్కడ వినిపించని హార్దిక్ పేరు.. అందరిని వెనక్కి నెట్టి ముందు వరుసలోకి వచ్చేసింది.


 ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా తర్వాత భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకోబోయేది ఈ స్టార్ ఆల్ రౌండర్ అని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. అందుకు తగ్గట్లుగానే అటు బీసీసీఐ కూడా అతనికి టి20 కెప్టెన్సీ బాధ్యతలను అప్పగిస్తూ వచ్చింది అని చెప్పాలి. ఇక ఇచ్చిన బాధ్యతలను అతను సక్రమంగా నిర్వహిస్తూ కెప్టెన్సీకి తానే సరైన ఆటగాడిని అన్న విషయాన్ని కూడా నిరూపించాడు. అయితే ఇక ఇప్పుడు జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కూడా హార్దిక్ పాండ్యా హవా నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హార్దిక్ పాండ్యా.


 ఒక ఆల్ రౌండర్ గా జట్టులో ఉన్న అందరూ ప్లేయర్ల కంటే నాపైన రెండు మూడింతలు  కాస్త ఎక్కువ భారం ఉంటుంది అంటూ హార్దిక్ పాండ్య చెప్పుకొచ్చాడు. ఎందుకంటే బ్యాటింగ్ చేసిన తర్వాత మళ్లీ బౌలింగ్ చేయాల్సి ఉంటుంది అంటూ హార్దిక్ పాండ్య చెప్పుకొచ్చాడు. ఇక దానికి తగినట్లుగానే ప్రీ క్యాంప్ సీజన్లో శిక్షణ తీసుకుంటాను అంటూ హార్దిక్ వెల్లడించాడు. జట్టు అవసరాన్ని బట్టి ముందుకు సాగుతాను అంటూ చెప్పుకొచ్చాడు   అయితే ఇటీవల కాలంలో టీమిండియాలో కష్టాల్లో ఉన్న సమయంలో కూడా హార్దిక్ పాండ్యా తన బ్యాట్ తోనే కాదు బౌలింగ్లో కూడా ఆదుకుంటూ జట్టును విజయతీరాలకు చేర్చుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: