వర్షంతో సూపర్ 4 మ్యాచ్ లన్ని రద్దు అయితే.. ఫైనల్ కు చేరే జట్లు ఏవో తెలుసా?
అయితే శ్రీలంక, భారత్ జట్లు మూడేసి మ్యాచ్లు ఆడాల్సి ఉండగా.. పాకిస్తాన్ బంగ్లాదేశ్ జట్లు రెండేసి మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అయితే వచ్చే పదిహేను రోజులపాటు కొలంబోలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో సూపర్ ఫోర్ మ్యాచ్ లపై నీలి నీడలు కమ్ముకున్నాయి అని చెప్పాలి. అయితే మొదటి నుంచి కూడా ఇక మ్యాచ్లకు అటు వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు సూపర్ ఫోర్ మ్యాచ్ లు అన్నీ కూడా వర్షం కారణంగా రద్దు అయితే పరిస్థితి ఏంటి? ఏ జట్టు ఫైనల్కు చేరుతాయి అనే అనుమానాలు కూడా అభిమానుల్లో తెర మీదకి వస్తున్నాయి.
అయితే పాకిస్తాన్ ఇప్పటికే రెండు పాయింట్స్ తో ఉంది సెప్టెంబర్ 10న భారత్తో సెప్టెంబర్ 14న శ్రీలంకతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే పాకిస్తాన్ ఖాతాలో నాలుగు పాయింట్లు చేరుతాయి. దాంతో పాకిస్తాన్ కు ఫైనల్ కి చేరుకుంటుంది. అదే సమయంలో భారత్ శ్రీలంక జట్లు ఆడాల్సిన మూడు మ్యాచ్లు రద్దు అయితే రెండు జట్ల ఖాతాలో మూడేసి పాయింట్లు చొప్పున చేరుతాయ్. దీంతో రన్ రేట్ కూడా సమంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో టాస్ ద్వారా ఫైనల్ కు చేరే జట్టును నిర్ణయిస్తారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య టాస్ వేస్తే ఇక ఇందులో ఎవరు గెలిస్తే వారు ఫైనల్ కి చేరుతారు అని చెప్పాలి.