నేను సెలెక్టర్ అయ్యుంటే.. అతన్ని వరల్డ్ కప్ ఎంపిక చేసేవాన్ని : హర్భజన్

praveen
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. అయితే భారత్ ఈసారి ఈ ఐసీసీ టోర్నీకి ఆతిధ్యం ఇస్తుంది అని చెప్పాలి. దీంతో భారత జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిపోతుంది అని చెప్పాలి. కాగా ఇప్పటికే అన్ని జట్లు అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ కోసం జట్టు వివరాలను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాయి అని చెప్పాలి. అయితే ఇటీవల అటు బీసీసీఐ కూడా 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను ప్రకటించారూ.


 అయితే ఇక బిసిసిఐ ప్రకటించిన టీం లో కొంతమంది ఆటగాళ్లకు చోటు దక్కకపోవడం పై ప్రస్తుతం తీవ్రస్థాయిలో చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా చాహల్ లాంటి ప్లేయర్కు జట్టులో చోటు ఇవ్వకపోవడంపై ఎంతో మంది మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు  ఇక ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు హర్భజన్  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఇద్దరు ఆటగాళ్లు మిస్ అయ్యారు అంటూ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉండగా.. భారత్ కేవలం ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను మాత్రమే ఎంపిక చేసింది.


 ఇదే విషయం గురించి హర్భజన్ సింగ్ మాట్లాడుతూ..  చాహాల్తో పాటు లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఆర్శదీప్ సింగ్ కు కూడా జట్టులో చోటు దక్కి ఉంటే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేశాడు పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎంతో ప్రమాదకరమైన స్పిన్నర్ అయిన చాహాల్ తో పాటు అర్షదీప్ ను ఎంపిక చేయాల్సింది. కొత్త బంతితో చక్కటి ప్రదర్శన చేసే ఆర్శదీప్ ను ఎందుకు తీసుకోలేదో అర్థం కాలేదు. మ్యాచ్ ఆరంభంలో వికెట్లు తీసే సత్తా ఉన్న అర్షదీప్ అందుబాటులో లేకపోవడం జట్టుకు పెద్దలోటే. ఒకవేళ నేను గనక జట్టు మేనేజ్మెంట్ లో భాగమై ఉండి ఉంటే మాత్రం తప్పకుండా జట్టులోకి చాహల్ ను ఎంపిక చేసే వాడిని అంటూ హర్భజన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: