జట్టులో చోటు దక్కలేదు.. అయితే ఏంటి.. భువనేశ్వర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?
అయితే ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ నుండి భువనేశ్వర్ కుమార్ ను తప్పించిన నేపథ్యంలో అతని కెరియర్ ముగిసింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2022 టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భువనేశ్వర్ కుమార్ కు భారత జట్టులో చాన్సే లేకుండా పోయింది. గత ఏడాది నవంబర్లో న్యూజిలాండ్ పర్యటనలో టి20 సీరియస్ లో అతను ఆఖరి సారిగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇక వరుస వైఫల్యాలతో చివరికి సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా అతన్ని తప్పించింది బీసీసీఐ.
ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి జట్టులో చోటు కరువైంది. ఈ సీనియర్ బౌలర్ కి అటు వన్ డే వరల్డ్ కప్ లో కూడా చోటు తగ్గలేదు. ఇక ఇదే విషయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భువనేశ్వర్ కుమార్. మన కెరియర్ ఎలా సాగుతుంది అన్న విషయం మనసు మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను అదే స్టేజ్ లో ఉన్నాను. కొన్నేళ్లపాటు మాత్రమే ఫాస్ట్ బౌలర్గా మనగలను. అవును టీమిండియాలో నాకు చోటు లేదు. అయినా ఆ విషయాన్ని నన్ను బాధించలేదు. రీ ఎంట్రీ ఇచ్చేందుకు నేను ఇవన్నీ చేయడం లేదు. ఇంకొన్నాళ్ళపాటు నాణ్యమైన క్రికెట్ ఆడాలని మాత్రమే కోరుకుంటున్నాను. ఈ క్రమంలో ఒకవేళ జాతీయ జట్టులో స్థానం దక్కితే దక్కవచ్చు. లేదంటే లేదు జట్టులోకి తిరిగి రావడం గురించి నేను ప్రయత్నాలు చేయడం లేదు. కేవలం మెరుగైన ప్రదర్శనలు ఇవ్వడం మీదే నాకు దృష్టి ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.