ఫిట్నెస్ సాధించేందుకు.. పాపం పంత్ ఎంత కష్టపడుతున్నాడో చూడండి?
రోడ్ ప్రమాదం కారణంగా గత కొన్ని నెలలుగా జట్టుకు దూరమైన టీం ఇండియా స్టార్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ మళ్ళి తిరిగి టీం లో అడుగు పెట్టేందుకు చాలా కష్టపడుతున్నాడు. ఇతను ప్రస్తుతం బెంగుళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్నాడు. తీవ్రమైన గాయాలకు గురైన రిషబ్ ఇప్పుడు కోలుకొని ఫిట్నెస్ తిరిగి పొందేందుకు కఠినమైన వ్యాయామాలు చేస్తున్నాడు. ఐతే తాను గాయపడిన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు అభిమానుల కోసం తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియా ద్వారా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు రిషబ్ పంత్. తాజాగా ఒక రిషబ్ తన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో ను పోస్ట్ చేసాడు.
తాను పోస్ట్ చేసిన వీడియో కి ఒక కాప్షన్ కూడా పెట్టాడు. చిమ్మచీకటిగా ఉండే స్వరంగం లో కూడా వెలుగును చూస్తున్న...అందుకు ఆ దేవుడికి నా కృతజ్ఞతలు అంటూ ఒక ఎమోషనల్ నోట్ పెట్టాడు. ప్రస్తుతం రిషబ్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, అభిమానులు అతనికి దేర్యం చెప్తూ, నీ రాక కోసం మేమందరం వేచి చూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు త్వరలోనే ఇండియన్ టీం లోకి రీఎంట్రీ ఇస్తావ్ అంటూ సపోర్ట్ చేస్తున్నారు.
గత ఏడాది డిసెంబర్ 30 న రిషబ్ పంత్ ఒక కార్ ఆక్సిడెంట్ కి గురైన విషయం మనందరికీ తెలిసినదే. డ్రైవ్ చేస్తుండగా నిద్ర పోవడంతో కార్ డివైడర్ ని ధీ కొట్టింది. ఈ ప్రమాదంలో రిషబ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వైద్యులు అతని మోకాలికి సస్త్ర చికిత్స చేసారు. నెలలు తరబడి మంచానికే అంకితమయ్యారు. ఈ మధ్యే కోలుకొని ఎన్సిఏ చేరుకున్నాడు. కొన్నాళ్లుగా అక్కడే ఉంటూ తన ఫిట్నెస్ మీద దృష్టి పెడుతున్నాడు. ఈ ఆక్సిడెంట్ కారణంగా రిషబ్ ఇప్పటికే ఐపీల్ మరియు ఆసియ కప్ కు దూరమయ్యాడు. ఐతే ఎలా అయిన అక్టోబర్ లో జరగబోయే ప్రపంచ కప్ టీం లో స్థానం సంపాదించాలని అతను ప్రయత్నిస్తున్న అవకాశాలు సన్నగానే ఉన్నాయ్. అన్ని సక్రమంగా సాగితే వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కి రిషబ్ పంత్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది.