ఆది లోనే ఆటంకం.. ఆసియ కప్ లో మొదటి మ్యాచ్ కు ముందే టీం ఇండియా కు షాక్?
ఆసియ కప్ లో భాగంగా సెప్టెంబర్ 2 న ఇండియా పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్ తో జరగనున్న ఈ మ్యాచ్ కి ఇండియన్ టీం ఎలా ఉండబోతోందో అని అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు. కే. ఎల్ ను టీం లోకి తీసుకున్నప్పుడు రోహిత్ తో పాటు గిల్ ఓపెనింగ్ చేస్తే, రాహుల్ మిడిల్ ఆర్డర్ లో బ్యాట్టింగ్ చేస్తాడని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు మొదటి రెండు మ్యాచ్లకు రాహుల్ దూరం అవ్వడంతో ఈ రెండు మ్యాచ్ లలో ఎవరికి అవకాశం ఇస్తారో సందేహంగా ఉంది. కే.ఎల్ రాహుల్ కీపర్ కం బ్యాట్స్మన్ కనుక సంజు శాంసన్, లేదా ఇషాన్ కిషన్ కి అవకాసం ఇవ్వడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయ్. ఐతే వీళ్ళిద్దరిలో ఎవర్ని ఎంపిక చేస్తారో వేచి చూడాలి. ఐతే కీలకమైన మ్యాచ్ కి రాహుల్ దూరం అవ్వడం భారత్ బ్యాట్టింగ్ లైన్ అప్ ను దెబ్బతీసే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.
గాయం నుంచి కోలుకొని నెట్స్ లో బాగానే బ్యాట్టింగ్ చేస్తున్న కే.ఎల్రా.హుల్ కు సడన్ గా ఏమయిందో అర్ధం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసారు టీం ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్. వరల్డ్ కప్ కు ముందు రిస్క్ తీసుకోలేమని, రాహుల్ కు అవసరమైన రెస్ట్ ఇవ్వాలని అన్నారు ద్రావిడ్.