పగబట్టిన నాగుపాము.. రెండు నెలల్లో ఎన్నిసార్లు కాటు వేసిందంటే?

praveen
సాధారణంగా పామును చూస్తేనే ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతూ ఉంటారు. ఒక కళ్ళ ముందు కనిపించేది విషపూరితమైన నాగుపాము అని తెలిస్తే ప్రాణాలు అటు నుంచి అటే గాల్లో కలిసిపోతాయి. అయితే పాములకు సంబంధించిన ఎన్నో వార్తలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంటాయి. సాధారణంగా పాములు పగబడతాయి అని అందరూ చెబుతూ ఉంటారు. ఇక వాటికి ఏదైనా హాని కలిగించాము అంటే చాలు గుర్తుపెట్టుకుని మరి మనుషులపై దాడి చేస్తాయని ప్రాణాలు తీసే అంతవరకు కూడా వదిలిపెట్టవు అని చెబుతూ ఉంటారు. అయితే ఇక ఇలాంటి కాన్సెప్ట్ తోనే ఎన్నో సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించాయి.


 ఈ సినిమాలు చూసిన తర్వాత నిజంగానే పాములు పగబడతాయి అని జనాలు అందరూ కూడా నమ్మడం మొదలుపెట్టారు. అయితే పాములకు అంత జ్ఞాపక శక్తి ఉండదని.. పాములు పగబట్టవు అని  శాస్త్రీయ ఆధారాలు కూడా చెబుతూ ఉంటాయ్. కానీ శాస్త్రీయ ఆధారాలు తప్పు అని నిరూపించే ఘటనలు మాత్రం కొన్ని కొన్ని సార్లు వెలుగులోకి వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక్కడ ఏకంగా ఒక నాగుపాము ఒక బాలుడు విషయంలో పగబట్టి రెండో నెలలో 9 సార్లు కాటు వేసింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.


 కలబురగి జిల్లా చిత్తపుర తాలూకాలోని అలకట్టి గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి ప్రజలను.. పాము అనేకసార్లు కాటేసింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండడం వల్ల.. అన్ని సార్లు పాముకాటుకు విరుగుడు ఇవ్వడంతో ఆ బాలుడు తప్పించుకోగలడు. దీంతో ఈ పాము కాటు విషయంలో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే తొమ్మిది సార్లు ఒకే పాము కాటు వేసింది. అయితే నాగ దోషం కోసం ఈ కుటుంబం చేయను పూజ లేదు. క్షేత్రంలో ఇంటి దేవత యొక్క చిన్న గుడి కూడా నిర్మించారు. అయితే 9 సార్లు కాటు వేసిన బాలుడు బతికి బట్ట కట్టడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుందని స్థానికులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: