క్రికెట్ చరిత్రలో తొలిసారి.. రెడ్ కార్డ్ ప్రయోగం.. తొలి బాధితుడు అతడే?
ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన మ్యాచ్లో తొలిసారి ఎంపైర్లు రెడ్ కార్డు రూల్ వినియోగించారు అని చెప్పాలి. రెడ్ కార్డు ద్వారా ఒక ఆటగాడిని మైదానం బయటికి పంపించారు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సెయింట్ కిడ్స్ అండ్ నేవీ పేట్రియాడ్స్ మ్యాచ్, ట్రిన్ బాగో నైట్ రైడర్స్ మ్యాచ్ జరిగింది. నైట్ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ కు అంపైర్ రెడ్ కార్డు చూపించాడు. దీంతో ఏం చేయలేక మైదానాన్ని విడాల్సి వచ్చింది. అయితే ఇలా రెడ్ కార్డు రూల్ తో మైదానం వీడిన మొట్టమొదటి క్రికెటర్ గా నరైన్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు అని చెప్పాలి.
స్లో ఓవర్ రేట్ కారణంగా జట్టులో ఎవరో ఒక ఆటగాడు మైదానాన్ని విడాల్సి ఉండడంతో.. అప్పటికే తన ఓవర్ల కోట పూర్తి చేసుకున్న సునీల్ నరైన్ పేరును నైట్ రైడర్స్ కెప్టెన్ కిరణ్ పోలార్డు ప్రతిపాదించాడు. దీంతో ఫీల్డ్ ఎంపైర్ నరైన్ కు రెడ్ కార్డ్ చూపించాడు. దీంతో అతను మైదానాన్ని వీడాడు. అయితే ఈ రెడ్ కార్డు విధానం కొత్తేమీ కాదు. తరచూ చూస్తూనే ఉంటాం. అయితే క్రికెట్లో కాదు ఫుట్బాల్ లో. ఆటగాడు కఠినమైన పౌలుకు పాల్పడినప్పుడు అతని రెడ్ కార్ చూపించి మైదానం వీడేలా ఆదేశిస్తాడు రిఫరీ. ఇప్పుడు క్రికెట్ లోనూ ఫుట్బాల్ లో లాగా రెడ్ కార్డు రూల్ రావడం ఆసక్తికరంగా మారిపోయింది