ఆసియా కప్ లో.. అందరి బండారం బయటపడుతుంది : పాక్ మాజీ
అయితే ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇక ఇప్పుడు ఆసియా కప్ ని కూడా వన్డే ఫార్మర్ లోనే నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. ఇక ఈ ఆసియా కప్ లో ఏకంగా 6 జట్లు పాల్గొనబోతున్నాయి అని చెప్పాలి. కాగా ఇక అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఆసియా కప్ కోసం ఇక జట్టు వివరాలను కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆసియా కప్ కు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో.. ఏ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్ళు సోషల్ మీడియాలో తెగ రివ్యూ ఇచ్చేస్తూ ఉన్నారు.
ఇక ఇదే విషయం గురించి పాకిస్తాన్ మాజీ బౌలర్ వసీం అక్రమ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని ఆసియా కప్ను వన్డే ఫార్మాట్ లోనే నిర్వహించాలి అని నిర్ణయించడం బాగుంది అంటూ అభిప్రాయపడ్డాడు. అయితే వన్డే ఫార్మాట్లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక మూడూ కూడా ప్రమాదకరమైన జట్లు అంటూ చెప్పుకొచ్చాడు. తనదైన రోజున ఏ జట్టునైనా సులభంగా ఓడించగలవు అంటూ అభిప్రాయపడ్డాడు. ఇటీవల కాలంలో బౌలర్లు అందరూ కూడా టి20 లకు బాగా అలవాటు పడ్డారని.. ఆసియా కప్ లో 10 ఓవర్లు బౌలింగ్ చేయగలుగుతారో లేదో తేలిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. పది ఓవర్లు బౌలింగ్ చేస్తే వారి సామర్థ్యం ఏంటో అర్థం అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు.