దేశం మారొచ్చు.. కానీ చెల్లిపై ప్రేమ ఎప్పటికి మారదు?
శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగ తన సోదరి చతు డిసిల్వా పెళ్లి ఘనంగా జరిగింది. చెల్లలి పెళ్ళిలో హసరంగ బోరున విలపించాడు. ఈ వీడియోని ఓ అభిమాని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఈ వీడియో పోస్ట్ అయిన కొన్ని క్షణాల్లోనే వైరల్ అయ్యింది. హాసరంగా తన చెల్లలి పెళ్లిని ఘనంగా చేసాడు. ఆ తరువాత అప్పగింతలు సమయంలో హాసరంగా భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్ళని ఆపుకోలేకపోయాడు. చెల్లలిని పట్టుకొని బోరున విలపించాడు. హాసరంగా చెల్లి కూడా భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. అన్నని పట్టుకొని బోరున విలపించింది. పెళ్ళికి వచ్చిన అతిధులు వారిని ఓదార్చే ప్రయత్నం చేసారు. చాలా సేపటి తరువాత హాసరంగా కన్నీళ్ళని తుడుచుకుంటూ మా చెల్లిని బాగా చూసుకోవాలని చెబుతూ బావపై కూడా పడి ఏడ్చాడు. బావ కూడా భయపడకండి నేను మీ చెల్లిని బాగా చూసుకుంటానని, భయపడాల్సిన అవసరం లేదని ధైయం చెప్పాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా స్పందించారు. నెటిజన్లు కూడా రెడ్ హార్ట్ ఎమోజీలతో సపోర్ట్ చేసారు. నెటిజెన్ స్పందిస్తూ ప్రతి సోదరుడు కచ్చితంగా తన చెల్లి పెళ్లి అంటే భావోద్వేగానికి గురవుతాడని పేర్కొన్నాడు. ఆరోజు మాత్రం కన్నీళ్ళని ఆపుకోలేరని, ఇది జీవితంలో గుర్తుండిపోయే రోజు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. మీరు కూడా లుక్ వేసేయండి. వచ్చే సీజన్ ఐపిఎల్ లో ఆర్సిబి హసరంగని విడుదల చేసే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.