ఇక వాళ్లకి నిద్రలేని రాత్రులే.. చంద్రయాన్ - 3 పై సెహ్వాగ్ కామెంట్ వైరల్?
అన్ని రంగాలకు చెందిన ప్రముఖులందరూ కూడా ఇస్రోని అభినందిస్తూ ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అని చెప్పాలి. ఇక ఇదే విషయంపై ఎంతోమంది భారత క్రికెటర్లు కూడా స్పందిస్తూ తమదైన శైలిలో పోస్టులు పెడుతూ ఉండడం గమనార్హం. కాగా టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఇక తనదైన శైలిలోనే ఒక ట్విట్ చేశాడు. విమర్శకులు అందరికీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. చంద్రయాన్ 3 సక్సెస్ పై సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే.. ఇక ఈ మెషిన్ కు వ్యతిరేకంగా విమర్శలు చేసిన వారికి చురకలు అంటించాడు.
ఏకంగా చంద్రయాన్ 3 పై విమర్శలు చేసిన వారికి ఇప్పుడు ఈ సక్సెస్ తో నిద్రలేని రాత్రులు ఉంటాయి అంటూ ట్విట్ చేసాడు. మనం సన్ సెట్ సమీపిస్తుండగా చంద్రుడి దక్షిణ ధ్రువం పై మనం సెట్ అయ్యాం. ఎంత అద్భుతమైన సందర్భం. ప్రతి ఎదురుదెబ్బ ఓ బలమైన పునరాగమనాన్ని చాటుతుందని మరోసారి నిరోపితమైంది. భారత్ విఫలం అవ్వాలని ఆరోపణలు చేసి వ్యతిరేకించే వారిని కొన్ని నిద్రలేని రాత్రులు ఉండబోతున్నాయి అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. దీంతో ఇది చూసిన నెటిజెన్స్ చంద్రయాన్-3 గురించి తక్కువ చేసి మాట్లాడిన వారందరికీ కూడా సెహ్వాగ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు అంటూ చర్చించుకుంటున్నారు.