అందుకే నేను, కోహ్లీ.. టి20లు ఆడటం లేదు : రోహిత్

praveen
ప్రస్తుతం టీమిండియాలో సీనియర్ క్రికెటర్లుగా కొనసాగుతున్నారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు. అయితే మొన్నటి వరకు విరాట్ కోహ్లీ భారత్ జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. ఎన్నో ఏళ్ల పాటు మూడు ఫార్మాట్లకు కూడా సారధిగా బాధ్యతలు నిర్వహించి జట్టును ముందుకు నడిపించాడు. అయితే ఇక విరాట్ కోహ్లీ ప్రస్తుతం కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. అటు రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి.

 అయితే గత కొంతకాలం నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లకు సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది. రోహిత్, విరాట్ కోహ్లీల టీ20 కెరియర్ ముగిసింది అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. ఇక ఇద్దరు స్టార్ ప్లేయర్లను కేవలం వన్ డే, టెస్ట్ ఫార్మట్ లలో మాత్రమే చూడగలం అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనికి కారణం గత కొంతకాలం నుంచి సెలెక్టర్లు టీమిండియా  ఆడుతున్న టి20 సిరీస్ లకు ఈ సీనియర్లను ఎంపిక చేయకపోవడమే. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించి అతని సారథ్యంలో  యువ జట్టును టీ20 సిరీస్ లకు పంపుతున్న సెలెక్టర్లు సీనియర్ క్రికెటర్లు రోహిత్ విరాట్ కోహ్లీలను మాత్రం పక్కన పెట్టేస్తున్నారు.

 దీంతో ఈ సీనియర్ క్రికెటర్ల  టి20 కెరియర్ ముగిసింది అంటూ వార్తలు వస్తున్నాయి  అయితే ఇలా టీ20 సిరీస్ లకు దూరంగా ఉండడం వెనక కారణమేమిటీ అనే విషయంపై రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. గత ఏడాది మేం టి20 వరల్డ్ కప్ కు ముందు వన్డే ఫార్మాట్లో మ్యాచ్లు ఆడలేదు. అయితే ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ ముందుంది. కాబట్టి టీ20 లు ఆడటం లేదు. పూర్తిస్థాయి సన్నద్ధం అయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. అయితే అందరి ఫోకస్ మా మీదే ఉంటుంది అన్న విషయం తెలుసు అంటూ కామెంట్ చేశాడు. అయితే రవీంద్ర జడేజా కూడా టి20 లు ఆడటం లేదు. కానీ అతని గురించి ఎందుకు అడగరు అంటూ రోహిత్ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: