ఇండియా vs పాక్ మ్యాచ్ టికెట్ ధర.. ఏకంగా రూ. లక్ష?
కేవలం ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలలో మాత్రమే ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ చూడొచ్చు. దీంతో ఎప్పుడో ఓసారి వచ్చే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ను క్రికెట్ ప్రపంచం మొత్తం కాస్త కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూస్తూ ఉంటుంది అని చెప్పాలి అయితే ఇక ఏడాది భారత వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. ఇందులో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది అని చెప్పాలి. అక్టోబర్ 14వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ దాయాదుల పోరుకి ఆతిథ్యం ఇస్తూ ఉంది అని చెప్పాలి. దీంతో ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా నేరుగా మైదానంలో ఈ చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ను వీక్షించాలని ఎంతగానో ఆశపడుతున్నారు.
ఈ కార్యక్రమంలోని ఫ్లైట్ టికెట్లు.. బస చేసేందుకు హోటల్ రూమ్స్ మరోవైపు మైదానంలో మ్యాచ్ టికెట్లను కూడా కొనుగోలు చేసేందుకు ఉన్నారు. అయితే ఇక ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న వేళ.. ఇప్పుడు మ్యాచ్ టికెట్ ధరలకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ మ్యాచ్ టికెట్ ధర దాదాపు 2000 నుంచి ఒక లక్ష వరకు ఉంటాయని క్రికెట్ ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ప్రెసిడెంట్ సూట్ ఎల్ 5, రిలయన్స్ బాక్సుల టికెట్ 75000 వరకు ఉంటుందట. ప్రెసిడెంట్ సూట్ ఎల్4 ధర ఏకంగా లక్ష వరకు ఉంటుంది అన్నది తెలుస్తుంది.