ఆర్సిబిని వదిలేయడం.. ఎంతో బాధగా ఉంది?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ప్రతిసారి బ్యాడ్ లక్ వెంటాడే టీం ఏదైనా ఉంది అంటే అది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అని చెప్పాలి. ఎందుకంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఏ టీం లో లేనట్లుగా అత్యుత్తమ ఆటగాళ్లు ఉంటారు. ప్రపంచ క్రికెట్లో ఉన్న స్టార్ ప్లేయర్ లందరూ కూడా ఈ టీంలోనే కనిపిస్తూ ఉంటారు. కానీ బెంగళూరు జట్టుకు మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్న ఇక జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. ప్రతిసారి ఈసాలా కప్ నమ్ దే నినాదంతో బరిలోకి దిగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తీవ్రంగా నిరాశ పరుస్తూనే ఉంటుంది.

 అయితే ఇక 2023 ఐపీఎల్ సీజన్లోనూ బెంగళూరు జట్టుకు ఇదే పరిస్థితి ఎదురైంది. కానీ 2024 ఐపీఎల్ సీజన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది బెంగళూరు జట్టు యాజమాన్యం. అయితే ఇప్పటికే కెప్టెన్సీ మార్పు జరిగింది. ఇప్పుడు మార్చాల్సిందల్లా కేవలం కోచింగ్ సిబ్బందిని మాత్రమే. దీంతో ఆదిశగా అడుగులు వేస్తుంది బెంగళూరు జట్టు యాజమాన్యం. ఈ క్రమంలోనే లోనే ఇక బెంగళూరు హెడ్ కోచ్ తో పాటు క్రికెట్ ఆపరేషన్డైరెక్టర్ పదవిలో కొనసాగుతున్న మైక్ హాసన్ ను కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక కొత్త కోచ్ గా అండి ఫ్లవర్ ను నియమించింది బెంగళూరు జట్టు యాజమాన్యం.

 అయితే తనను ఇలా ఆర్సిబి జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించడం పై మైక్ హెసేన్  ఎమోషనల్ అయ్యాడు. గత నాలుగు సీజన్ల నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకి హెడ్ కోచ్గా వ్యవహరిస్తూ ఉన్నాను. అయితే మూడుసార్లు జట్టు ప్లే ఆఫ్ కు చేరింది. కానీ ట్రోఫీ మాత్రం గెలవలేకపోయాం. అయితే ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును వదిలేస్తున్నందుకు ఎంతో బాధగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన జట్టు యజమానులకు కృతజ్ఞతలు. ఇక అద్భుతమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులకు ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు మైక్ హెసేన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb

సంబంధిత వార్తలు: