ఏంటి.. కోహ్లీని పక్కన పెడుతున్నారా.. ఇక టీమిండియా పరిస్థితి అంతే?
ఈ క్రమంలోనే వరల్డ్ క్రికెట్లో అద్భుతం ప్లేయర్గా ఇక టీమిండియా కు బ్యాక్ బోన్ గా ఉన్న విరాట్ కోహ్లీని గత కొంతకాలం నుంచి సెలెక్టర్లు పక్కన పెడుతున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అభిమానులు అందరూ కూడా అవును అనే సమాధానం చెబుతున్నారు. ఇక ఒకవైపు వన్డే వరల్డ్ కప్ సమీపిస్తున్న వేళ ఆటగాళ్ళతో వీలైనన్ని ఎక్కువ వన్డే మ్యాచ్లు ఆడించి ఆ ఫార్మాట్లో మరింత రాటుదేలేలా చేయాల్సింది పోయి.. ఏకంగా జట్టులో కీలక ప్లేయర్లుగా కొనసాగుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వరుసగా విశ్రాంతి ప్రకటిస్తూ ఉన్నారు సెలెక్టర్లు. ఇదే విషయంపై అటు మాజీలు కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.
కాగా ఇటీవల టీమిండియా వన్డే సిరీస్ గెలిచిన అటు ఫ్యాన్స్ కి మాత్రం నిరాశ తప్పలేదు. ఎందుకంటే ఈ సిరీస్లోకి కోహ్లీ సెంచరీలతో చెలరేగుతాడు అనుకుంటే రెండే వన్డే మ్యాచ్ లో వాటర్ baay గా.. మూడో వన్డే మ్యాచ్ లో సబ్స్టిట్యూట్ ఫిల్టర్ గా విరాట్ కోహ్లీని చూసి ఆందోళన చెందుతున్నారు. వరల్డ్ కప్ కి ముందు ఇలాంటి ప్రయోగాలు ఎందుకు.. క్రమక్రమంగా కోహ్లీని జట్టు నుంచి పక్కన పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.. అలా చేశారంటే టీమ్ ఇండియా పరిస్థితి అధోగతి అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.