చరిత్ర సృష్టించిన సౌద్ షకీల్.. పాక్ క్రికెట్ లో ఒకే ఒక్కడు?

praveen
సాధారణంగా క్రికెట్లో టెస్ట్, వన్డే, టి20 అంటూ మూడు ఫార్మాట్లు ఉంటాయి. కానీ క్రికెట్ పురుడు పోసుకున్న నాటి నుంచి కొనసాగుతూ వస్తున్న టెస్ట్ ఫార్మాట్ ని మాత్రం ప్రతి ఆటగాడు కూడా కాస్త ఎక్కువగానే ఇష్టపడుతూ ఉంటాడు అని చెప్పాలి. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో ఎన్ని రికార్డులు సాధించినప్పటికీ అటు టెస్ట్ ప్లేయర్గా తనను పిలిపించుకోవాలని ఆశ పడుతూ ఉంటారూ అని చెప్పాలి. ఇక టెస్ట్ క్రికెట్లో మంచి ప్రదర్శన చేసి రికార్డులు కొల్లగొట్టాలని అనుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే టెస్ట్ జట్టులో ఛాన్స్ వచ్చిందంటే చాలు అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.


 ఇటీవల కాలంలో ఎంతోమంది యంగ్ ప్లేయర్లు అటు టెస్ట్ మ్యాచ్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే సెంచరీలు, డబుల్ సెంచరీలు చేస్తూ ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టిస్తూ ఉన్నారు అని చెప్పాలి. కాగా ఈ ప్రస్తుతం అటు పాకిస్తాన్ జట్టు శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడుతూ ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల తొలి టెస్ట్ ప్రారంభం ఇది కాక ఈ తొలి టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ సౌదీ షకీల్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఏకంగా డబుల్ సెంచరీ తో చెలరేగిపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ డబుల్ సెంచరీ ద్వారా ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టించాడు ఈ ప్లేయర్.


 ఇటీవల శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లు ఏకంగా 208 పరుగులు చేసి అదరగొట్టిన సౌద్ షకీల్ ఇక శ్రీలంకలో జరిగిన మ్యాచ్లో ఇలా డబుల్ సెంచరీ చేసిన తొలి పాకిస్తాన్ బ్యాట్స్మెన్ గా చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. అంతకుముందు మహమ్మద్ హఫీజ్ చేసిన 196 పరుగులు ఇప్పటివరకు శ్రీలంకతో పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు చేసిన అత్యధిక పరుగులుగా ఉండగా.. ఇప్పుడు సౌద్ షకీల్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు అని చెప్పాలి. ఒకవైపు వికెట్లు పడుతున్న అఘా సల్మాన్ (81) తో కలిసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అయితే తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ 461 పరుగులకు అలౌట్ అవడంతో ఇక 149 పరుగుల ఆదిక్యం లభించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: