బీసీసీఐ ముందు.. పాక్ బోర్డు కొత్త డిమాండ్?

praveen
ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఈ వరల్డ్ కప్ కు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ ని కూడా విడుదల చేసింది. ఈ క్రమంలోనే అన్ని జట్లు కూడా వరల్డ్ కప్ కోసం సిద్ధమైపోతున్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే క్రికెట్ ప్రపంచం మొత్తం పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. అయితే ఈ ఏడాది భారత్ వేదికగా  పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఉత్కంఠ రెట్టింపు అవుతుంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో అటు పాకిస్తాన్ వరల్డ్ కప్ లో ఆడుతుందా లేదా అనే అనుమానాలు కూడా తెరమీదకి వస్తున్నాయి.

 ఎందుకంటే పాకిస్తాన్ వేదికగా జరిగే ఆసియా కప్ కోసం తాము పాకిస్తాన్ కు వెళ్లలేమని తటస్థ వేదికపై టోర్నీ నిర్వహిస్తేనే తాము ఆడుతాము అంటూ స్పష్టం చేసింది బిసిసిఐ. ఇలాంటి నేపథ్యంలోనే అటు పాకిస్తాన్ ఇండియాకు వచ్చేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే భారత్ అటు ఆసియా కప్ కోసం పాకిస్తాన్ రానప్పుడు మేము కూడా వరల్డ్ కప్ కోసం భారత్కు వెళ్ళము అంటూ ఆ దేశ క్రీడామంతే మాట్లాడటంతో పాకిస్తాన్ వరల్డ్ కప్ కోసం ఇండియాలో అడుగు పెట్టడం కష్టమే అంటూ వార్తలు కూడా వచ్చాయి.

 అయితే ఇటీవలే పాకిస్తాన్ క్రీడామంత్రి మజారి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చూసారూ. భారత్ రాజకీయాలను క్రీడల్లోకి ఎందుకు తీసుకువస్తుంది అంటూ ప్రశ్నించారు ఆయన. ఆసియా కప్ టోర్ని పాకిస్తాన్ లో ఆడేందుకు భారత ప్లేయర్లకు భద్రతాపరమైన ఆందోళనలు ఉంటే.. వన్డే వరల్డ్ కప్ ఇండియాలో ఆడేందుకు తమ ఆటగాళ్లకు కూడా ఆందోళన ఉంటుందని భారత్లో అప్పుడప్పుడు అల్లర్లు జరుగుతున్నాయి  అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆసియా కప్ కోసం భారత్ కోరినట్లుగానే తాము కూడా తటస్థ వేదిక కోరే అవకాశం ఉంది అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మజారి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: