రోహిత్ కెప్టెన్సీ.. తీవ్రంగా నిరాశపరిచింది : గావస్కర్

praveen
వరల్డ్ క్రికెట్లో ప్రతిష్టమైన టీం లలో ఒకటిగా ఉన్న టీమిండియాకు గత కొంతకాలం నుండి మాత్రం అటు వరల్డ్ కప్ గెలవడం అనేది కష్టమైన పనిగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో ధోని కెప్టెన్సీలో గెలిచిన వరల్డ్ కప్ గురించి మాట్లాడుకోవడం తప్ప.. అటు కెప్టెన్లు మారిన టీమిండియా మాత్రం వరల్డ్ కప్ గెలవడం లేదు. అయితే కోహ్లీ కెప్టెన్సీలో వరల్డ్ కప్ రాలేదని.. అతని కెప్టెన్సీ నుంచి తప్పించాలి అంటూ డిమాండ్లు వచ్చాయి.


ఆ తర్వాత అనూహ్యంగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇక రోహిత్ శర్మ చేతికి కెప్టెన్సీ పగ్గాలు వచ్చాయి అని చెప్పాలి. అయితే ఐపీఎల్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. ఏకంగా ఐదుసార్లు టైటిల్ గెలిచిన సారధిగా కూడా ఉన్నాడు అని చెప్పాలి. దీంతో అతని కెప్టెన్సీలో టీమిండియా తప్పకుండా వరల్డ్ కప్ గెలుస్తుంది అని అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో అతని కెప్టెన్సీలో కూడా అభిమానులకు నిరాశ ఎదురవుతుంది.



 గత ఏడాది టీ20 వరల్డ్ కప్, ఈ ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండిట్లోనూ ఇండియా ఓడిపోయింది. ఇదే విషయంపై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. రోహిత్ కెప్టెన్సీ నిరాశపరిచింది అంటూ చెప్పుకొచ్చాడు. సారధిగా అతని నుంచి నేను ఎంతగానో ఆశించాను. భారత్లో రాణించడం వేరు విదేశాల్లో మెరుగైన ప్రదర్శన చేయటం పెద్ద పరీక్ష. ఆ విషయంలో కాస్త నిరాశ పరిచాడు. ఐపీఎల్ lo ఎంతో అనుభవం ఉంది  కెప్టెన్ గా వందల మ్యాచ్ లు ఉన్నాడు. కానీ టీమిండియాను ఫైనల్ కు తీసుకెళ్ళలేకపోయాడుఅంటూ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. డబ్ల్యూటీసి ఫైనల్ లో  జట్టు ఓటమిపై  మాట్లాడుతూ ఓటమిపై బీసీసీఐ సెలక్షన్ సమీక్ష నిర్వహించి కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్లను వాళ్ళ నిర్ణయాలపై ప్రశ్నించాలి అంటూ సునీల్ గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: