ఓడిపోతామనే భయం.. అందుకే టీమిండియా పాక్ రాదు : అబ్దుల్ రజాక్

praveen
వరల్డ్ క్రికెట్లో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే వరల్డ్ క్రికెట్లో దయాతి దేశాలుగా అటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా కొనసాగుతున్నప్పటికీ అసలు సిసలైన చిరకాల ప్రత్యర్థులు మాత్రం పాకిస్తాన్- ఇండియాలు మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా మధ్య కేవలం క్రికెట్లో మాత్రమే వైరం ఉంటే అటు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ తో పాటు సరిహద్దుల వద్ద కూడా వైరం కొనసాగుతూ ఉంటుంది.

 ఈ క్రమంలోని ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరిగిందంటే చాలు ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కళ్ళని పెద్దవి చేసి మరి ఈ మ్యాచ్ ని వీక్షిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కేవలం ఐసిసి టోర్నీలలో తప్ప ఇక మిగతా ద్వైపాక్షిక సిరీస్లలో  ఎక్కడ ఈ రెండు జట్లు తలబడటం లేదు. అయితే ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్ పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉండగా.. తాము పాకిస్తాన్ వెల్లబోము అంటూ ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది.

 ఇలాంటి సమయంలో ఇక పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనగా మారిపోయాయి. పాకిస్తాన్ కు రావాలంటే టీం ఇండియాకు ఓడిపోతామని భయం ఉంటుంది అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ఇటీవలే ఒక స్థానిక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ మాజీ ప్లేయర్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ.. ఇండియా పాకిస్తాన్ పర్యటనకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించేది కాదు. ఒక రకంగా భయపడేది. ఎందుకంటే అప్పుడు మేం బలమైన జట్టుగా.. ఉన్నాం. మాతో ఆడిన మ్యాచ్ లలో భారత్ ఎక్కువగా ఓడిపోయేది. అందుకే ఇప్పుడు కూడా పాకిస్తాన్ కి భారత్ రావడానికి భయపడుతుంది అన్నట్లుగా అబ్దుల్ రజాక్ కామెంట్లు చేశాడు. ఇక అతను చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: