నేను ఆడినట్లు.. పూజార ఆడలేడు : పృథ్వి షా
కానీ ఇక భారత క్రికెట్ ప్రేక్షకులు అతనికి ఇచ్చిన బిరుదును అతను నిలబెట్టుకోలేకపోయాడు. కొన్ని మ్యాచ్లలో మెరుపులు మెరూపించిన పృథ్వి షా ఆ తర్వాత నిలకడలేమితో జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక దేశవాళీ క్రికెట్లో రాణించి పలుమార్లు జట్టులోకి వచ్చిన మళ్లీ అలాంటి వైఫల్యాన్ని కొనసాగించాడు. దీంతో సెలెక్టరు ప్రతి విషయాన్ని జట్టు ఎంపిక విషయంలో ప్రతిసారి పక్కన పెట్టడం చేస్తూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న దిలీప్ ట్రోఫీ లో కూడా పృథ్వి షా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు అని చెప్పాలి.
అతని ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కాగా తనపై వస్తున్న విమర్శల గురించి స్పందించిన పృథ్వి షా ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగతంగా తన ఆట తీరు మార్చుకోవాలని అనుకోవడం లేదు అంటూ ఈ యంగ్ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. అయితే తెలివిగా ఆడేందుకు ప్రయత్నిస్తాను అంటూ తెలిపాడు. నేను ఆడినట్లు పూజార ఆడలేరూ.. అదే సమయంలో అతని మాదిరి నేను కూడా ఆడలేను. అందుకే నా లాగే నేను ఆడతా.. నా దూకుడుని కొనసాగిస్తా.. దేశవాళీ టోర్నీలో బాగా రాణించినప్పుడే టీమ్ ఇండియాలో ఎంపిక కావడానికి అవకాశాలు వస్తాయి అంటూ పృథ్వి షా చెప్పుకొచ్చాడు.