అజిత్ అగార్కర్ ముందు అతిపెద్ద సవాల్.. ఏం చేస్తాడో?
అజిత్ అగార్కర్ మొదటి సవాల్ ప్రపంచ కప్ జట్టు ఎంపిక. అజిత్ అగార్కర్, టీం ఇండియా ఫోకస్ మొత్తం ఇప్పుడు వన్ డే వరల్డ్ కప్ పైనే. అజిత్ అగార్కర్ ఇప్పటి నుంచే బెస్ట్ టీం ను సెలెక్ట్ చేయాలి. ఈ వరల్డ్ కప్ ఓడిపోతే మాత్రం తీవ్ర నిరాశ తప్పదు. అందుకే అజిత్ అగార్కర్ ముందు మంచి జట్టును సెలెక్ట్ చేయాలి. టీం ఇండియాలో చాలా మంది గాయాలతో బాధపడుతున్నారు. అయితే బిసిసిఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ కూడా కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఎవరైనా రాణించకపోతే మరో మంచి ప్లేయర్ ని కూడా సెలెక్ట్ చేయాలి.
ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. అయితే ద్రవిడ్ నాయకత్వంలో కూడా భారత్ ఘోరంగా విఫలమైంది. గత ఏడాది t20 ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్స్‌లో నిరాశపరిచింది. ద్రవిడ్ కి కూడా 2023 ప్రపంచకప్ గెలవడం చాలా ముఖ్యం. భారత్ లోనే జరుగుతున్న ఈ ప్రపంచకప్ గెలవకపోతే అజిత్ అగార్కర్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్‌ను వెతకాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.
కోహ్లీ, రోహిత్ తరువాత అన్ని ఫార్మాట్లలో శాశ్వత కెప్టెన్ లను కూడా అజిత్ అగార్కర్ రెడీ చేయాలి. t20, ODIలకు శాశ్వత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను సెలెక్ట్ చేసే అవకాహం ఉంది. హార్దిక్ ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ కు ఒక కప్ ను అందించాడు. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఫైనల్స్ కి చేర్చాడు. 2024 ప్రపంచకప్ టీ20 జట్టులో ప్రధానంగా యువ ఆటగాళ్లు ఉంటారు, బహుశా సీనియర్ ప్లేయర్స్‌లో కోహ్లి మాత్రమే ఉండే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలగడానికి ఇది సమయం. ఈ ముగ్గురు ప్లేయర్స్ ODIలలో ఏడాది లేదా రెండు సంవత్సరాలు కొనసాగవచ్చు. వన్ డే, t20 లోనే కాదు టెస్టు టీంలో కూడా మార్పులు అవసరం. భవిష్యత్తుపై దృష్టి పెట్టడానికి టెస్ట్, t20 జట్లకు పూర్తిగా పునర్నర్మించాల్సిన అవసరం ఉంది. ఈ పనులన్నింటినీ అగార్కర్ జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉంది.