వైరల్ : సిక్సర్లతో చెలరేగిన రోహిత్, యశస్వి జైస్వాల్?
కాగా ప్రస్తుతం టీమిండియా వార్మఫ్ మ్యాచ్ లు ఆడుతూ బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే బుధవారం నుండి రెండు రోజులపాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది కాగా బుధవారం ప్రారంభమైన మ్యాచ్లో వెస్టిండీస్కు చెందిన 8 మంది ఫస్ట్ క్లాస్ ఆటగాళ్లు భాగమయ్యారు. ఇక కరేబియన్ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు టీమిండియా ఈ వార్మప్ మ్యాచ్లను ఆడుతుంది అనే విషయం తెలిసిందే. అయితే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమ్ ఇండియాలో కొత్త ఓపెనింగ్ జోడిని చూస్తే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మకు జోడిగా యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా బరిలోకి దిగబోతున్నాడట.
ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ లో రోహిత్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేశారు. కాగా ఈ వార్మఫ్ మ్యాచ్లో ఒకవైపు రోహిత్ మరోవైపు యశస్వి జైశ్వాల్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు అని చెప్పాలి. అయితే రోహిత్ చాలా రోజుల తర్వాత మంచి టచ్ లో కనిపించడం గమనార్హం. అదేవిధంగా యంగ్ ప్లేయర్ యశస్వి కూడా భారీగా బౌండరీల వర్షం కురిపించాడు. అయితే అటు విరాట్ కోహ్లీ మాత్రం కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయాడు అని చెప్పాలి. ఇలా రోహిత్ శర్మ యశస్వి జైష్వాల్ బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీలతో చెలరేగిపోయిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.