వారెవ్వా.. ఇద్దరు టీమ్ ఇండియా క్రికెటర్లు అగ్రస్థానంలో?
Kaaga గత కొంతకాలం నుంచి భారత క్రికెటర్లు టెస్ట్ ఫార్మట్ లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి ప్రదర్శన ద్వారా అటు ర్యాంకింగ్స్ లో కూడా సత్తా చాటుతూ ఉన్నారు ఎంతోమంది క్రికెటర్లు. ఈ క్రమంలోనే ఐసీసీ ప్రకటించే ర్యాంకింగ్స్ లో ఏకంగా అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంటున్నారు అని చెప్పాలి. ఇక ఎప్పుడు టీమిండియా క్రికెటర్లు ఇద్దరూ కూడా రెండు విభాగాల్లో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు.
ఆ క్రికెటర్లు ఎవరో కాదు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తో పాటు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల ప్రకారం భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలర్ల జాబితాలో టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు అని చెప్పాలి. 860 రేటింగ్ పాయింట్స్ తో టాప్ లో నిలిచాడు. అయితే ఆల్ రౌండర్లా జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ఇక ఆల్ రౌండర్ ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానం చోటు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇదే లిస్టులో అక్షర్ పటేల్ ఒక స్థానం దిగజారి ఐదవ స్థానానికి చేరుకున్నాడు.