అదరగొట్టిన నీరస చోప్రా.. అగ్రస్థానం సొంతం?

praveen
టోక్యో ఒలంపిక్స్ లో బంగారు పథకాన్ని గెలిచి ఇక 130 కోట్ల భారత ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన నీరజ్ చోప్రా గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. జావలిన్ త్రో విభాగంలో అతను అద్భుతమైన ప్రతిభను కనబరిచి.. గోల్డ్ మెడల్ సాధించాడు. ఒలంపిక్స్ లాంటి విశ్వవేదికపై త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా చేసాడు అని చెప్పాలి. అయితే కేవలం ఒలంపిక్స్ మాత్రమే కాదు ఆ తర్వాత అతను ఆడిన ప్రతి వేదికపై కూడా సత్తా చాటుతూనే వస్తూ ఉన్నాడు. అంతేకాదు తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఇక ఇటీవల డైమండ్ లీగ్ లో కూడా మరోసారి నీరజ్ చోప్రా తన సూపర్ ఫామ్ను కొనసాగించాడు. జావలిన్ త్రో విసిరి మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. గాయం నుంచి కోలుకొని ఈ టోర్నీ ద్వారా పునరాగం మనం చేసాడు నీరజ్ చోప్రా. ఈ క్రమంలోనే ఇటీవలే టోర్నీలో భాగంగా జావలెన్ ను 87.66 మీటర్లు విసిరి నెంబర్ వన్ స్థానంలో నిలిచి విజేతగా అవతరించాడు అని చెప్పాలి. హేమా హేమీలు బరిలో నిలిచిన ఈ పోటీలో నీరజ్ తొలి ప్రయత్నం లోనే విఫలమయ్యాడు. అయితే రెండో ప్రయత్నంలో 83.52 మీటర్లు, మూడో ప్రయత్నంలో 85.04 మీటర్లు విసిరాడు నీరజ్ చోప్రా.


 అయితే నాలుగో ప్రయత్నంలో మళ్లీ విఫలమైన నీరజ్ చోప్రా ఐదో ప్రయత్నంలో మాత్రం 87.66 మీటర్లు విసిరి ఒక్కసారిగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇకపోతే రెండో స్థానంలో నిలిచిన జర్మనీకి చెందిన వేబర్ 87.03 మీటర్లు విసరగా.. మూడో స్థానంలో నిలిచిన జాకబ్ వార్లిచ్ 86.13 మీటర్లు విసిరాడు. Kaaga ఈ ఏడాది ఖతార్లో జరిగిన దోహా డైమండ్ లీగ్ లో టోర్నీలో అగ్రస్థానానికి చేరుకున్న నీరజ్ చోప్రా.. తర్వాత కండర గాయంతో పావొ నూర్మి ఈవెంట్ కు దూరమయ్యాడు. ఇక ఇటీవల రీఎంట్రీలో అదరగొట్టాడు. అగ్రస్థానంలో నిలిచిన నీరజ్ చోప్రాకి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: