బ్యాటింగ్లో అదుర్స్.. స్మిత్ ఖాతాలో మరో అరుదైన రికార్డు?
ఇకపోతే ప్రస్తుతం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఎంతో ప్రతిష్టాత్మకమైన యాషెష్ సిరీస్ లో భాగంగా స్మిత్ ఆస్ట్రేలియా జట్టులో ఎంతో కీలక ప్లేయర్గా కొనసాగుతున్నాడు. మొదటి టెస్ట్ మ్యాచ్ లో కూడా మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా 85 పరుగులు చేసి ఇక జట్టుకు మంచి స్కోర్ అందించడంలో కీలక పాత్ర వహించాడు. అయితే ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించిన ఈ సీనియర్ బ్యాట్స్మెన్.. ఇక ఇటీవల 85 పరుగులు చేయడం ద్వారా మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో ఏకంగా తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ స్మిత్. అతి తక్కువ ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్ గా కూడా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. స్మిత్ తొమ్మిది వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి 174 ఇన్నింగ్స్ లను ఆడాడు. అయితే అంతకుముందు కుమార సంగకర 172 ఇన్నింగ్స్ లోనే ఇలా తొమ్మిది వేల పరుగుల మైలురాయిని అందుకోవడం గమనార్హం. ఇక ఈ లిస్టులో స్మిత్ తర్వాత ద్రవిడ్ 176 ఇన్నింగ్స్ లు, లారా 177 ఇన్నింగ్స్ లు, రికీ పాంటింగ్ 177 ఇన్నింగ్స్ లతో తర్వాత స్థానాల్లో ఉన్నారు.