ధోని కాదు.. అతని అసలైన మిస్టర్ కూల్ కెప్టెన్ : గవాస్కర్

praveen
భారత క్రికెట్లో మిస్టర్ కూల్ కెప్టెన్ ఎవరు అని చిన్న పిల్లాడిని అడిగిన.. గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తారు అతను ఎవరో కాదు మహేంద్ర సింగ్ ధోని అని. ఎందుకంటే భారత క్రికెట్ హిస్టరీలో ధోని కెప్టెన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. భారత జట్టుకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్పును తన కెప్టెన్సీ లోనే అందించాడు మహేంద్ర సింగ్ ధోని. ఇంతకీ మహేంద్రసింగ్ ధోనీకి మిస్టర్ కూల్ అనే బిరుదు ఎందుకు వచ్చిందో అందరికీ తెలిసే ఉంటుంది.

సాధారణంగా క్లిష్ట పరిస్థితులు ఉన్న సమయంలో ఎవరైనా సరే కెప్టెన్ గా ఉన్న ఆటగాడు ఒత్తిడికి లోనవ్వడం చూస్తూ ఉంటాం. ఈ క్రమంలోనే ఎవరైనా ఆటగాళ్లు తప్పు చేస్తే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ మహేంద్ర సింగ్ ధోని మాత్రం అలా కాదు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా చిరునవ్వును చిందిస్తూ ఉంటాడు. లోపల భావోద్వేగాలను దాచుకొని బయటికి మాత్రం నవ్వుతూ కనిపిస్తాడు. దీంతో అభిమానులే అతనికి మిస్టర్ కూల్ కెప్టెన్ అనే ఒక బిరుదును కట్టబెట్టారు. ఇప్పటికీ కూడా మహేంద్ర సింగ్ ధోనిని అలాగే పిలుస్తూ ఉంటారు అందరూ.

 కానీ భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్  మాత్రం మిస్టర్ కూల్ కెప్టెన్ అంటే మహేంద్రసింగ్ ధోని కాదు.. మరొకరు అంటూ చెప్పుకొచ్చాడు. నిజమైన మిస్టర్ కూల్ కెప్టెన్ ధోని కాదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఒరిజినల్ కెప్టెన్ కూల్ 40 ఏళ్ల క్రితం టీమిండియాకు తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ అంటూ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. గవాస్కర్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. కాగా 1983లో వరల్డ్ కప్ గెలిచిన సమయంలో ఇక కపిల్ దేవ్ కెప్టెన్సీ లోని టీమిండియా జట్టులో గవాస్కర్ కీలక సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: