సర్ఫరాజ్ ఖాన్ ను.. అందుకే ఎంపిక చేయలేదట?
వెరసి ఇక వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా ఆడబోయే టెస్ట్ సిరీస్లో అటు సర్ఫరాజ్ కు చోటు దక్కలేదు. దీంతో అతన్ని ఎంపిక చేయకపోవడం పై విమర్శలు వస్తున్నాయ్. ఇక ఇదే విషయంపై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందించారూ. సర్ఫరాజ్ ను ఎంపిక చేయకపోవడంతో వ్యక్తమౌతున్న ఆగ్రహాన్ని అర్థం చేసుకోగలం. కానీ ఈసారి అతని పట్టించుకోకపోవడం వెనక కేవలం క్రికెట్ కాకుండా ఎన్నో కారణాలు ఉన్నాయి. రంజి సీజన్లో 900కు పైగా పరుగులు చేసిన అతని పక్కన పెట్టడానికి సెలెక్టర్లు ఏమి మూర్ఖులు కాదు. అతని ఫిట్నెస్ అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలకు తగ్గట్లు కాలేదు.
అందుకే ఇప్పటికైనా అతను బరువు తగ్గి ఫిట్ గా మారాలి. జట్టులో ఎంపికకు కేవలం బ్యాటింగ్ ఒకటి సరిపోదు. మైదానంలో మైదానం బయట అతని ప్రవర్తన ఉత్తమంగా లేదు. అతను గతంలో క్రమశిక్షణ రాహిత్యంతో చేసిన కొన్ని సంజ్ఞలు మరికొన్ని సందర్భాల్లో అతని ప్రవర్తనను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే.. వెస్టిండీస్ పర్యటన కోసం అతని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రిజర్వ్ ఆటగాళ్లలోనూ అతను ఎందుకు లేడో ఆలోచించాలి. ఐపిఎల్ లో రాణించకపోవడంతో అతని ఎంపిక చేయలేదన్నది అవాస్తవం అంటూ ఒక బీసీసీఐ ప్రతినిధి చెప్పుకొచ్చారు. ఏడాది ఒక రంజీ మ్యాచ్ లో.. సెంచరీ తర్వాత సెలెక్టెర్లను వెక్కిరించే విధంగా సర్ఫరాజ్ సంబరాలు జరుపుకున్నాడని బీసీసీఐ భావిస్తుందట.