భర్త ఆస్తిలో భార్య హక్కుపై.. హైకోర్టు కీలక తీర్పు?

praveen
భార్యా భర్తల బంధం లో ఇటీవల కాలం లో అన్యోన్యత అనేది కరువైంది అన్న విషయం తెలిసిందే. మూడు ముళ్ల బంధం తో పెళ్లి అనే బంధం లోకి అడుగు పెడుతున్న ఎంతో మంది.. ఇక తక్కువ సమయం లోనే మనస్పర్ధల తో విడిపోవడానికి విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్న ఘటనలు కూడా చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇక కట్టుకున్న వారితో కలిసి ఉండాలి అని కోరుకునే వారి కంటే.. కట్టుకున్న వారి ఆస్తి లో వాటా కావాలని కోరుకునే వారు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు అని చెప్పాలి.


 అయితే ఇటీవల కాలం లో భార్యా భర్తలు ఎన్నో చిత్ర విచిత్రమైన కారణాలు చూపుతూ ఇక ఒకరిపై ఒకరు కేసు పెట్టుకుంటూ.. కోర్టు మెట్లు ఎక్కుతున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. అయితే ఇలాంటి కేసుల విషయం లో విచారణ జరిపి అటు కోర్టులు కూడా షాకింగ్ తీర్పులు వెల్లడిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఇలాగే సంచలనం  గా మారి పోయింది. భర్త ఆస్తి విషయం లో భార్యకు ఉండే హక్కు విషయం లో కీలక తీర్పు వెలువరించింది మద్రాస్ హైకోర్టు.


 భర్త సంపాదించే ఆస్తి  లో భార్యకు సమాన మాట ఉంటుంది అంటూ కీలకమైన తీర్పు చెప్పింది. ఈ క్రమం లోనే కుటుంబానికి భార్య పరోక్ష సహకారం ఉంటుందని.. ఇంటిని చూసుకోవడంతో భర్తకు సహాయం చేస్తుందని మద్రాసు హైకోర్టు తెలిపింది. కుటుంబ సంక్షేమం కోసం భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉమ్మడి సహకారంతో ఆస్తులను సంపాదించినట్లు అయితే భార్యాభర్తలిద్దరూ కూడా ఆస్తిలో సమాన వాటాదారులే అవుతారు అంటూ మద్రాస్ హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలోనే ఈ తీర్పు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: